తాగు నీరు అందించే విషయంలో సమస్య పరిష్కారానికి హామీ!!!!
గృహ జ్యోతి ఉచిత విద్యుత్ పథకం ప్రారంభించిన అడ్లూరి!!! జగిత్యాల నేటి ధాత్రి
ధర్మపురి అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు ధర్మపురి మండల కేంద్రంలోని స్థానిక ముదిరాజ్ కాలనీలో సోమవారం రోజున ఆరు గ్యారెంటీలలో భాగమైన గృహ జ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,ఆరోగ్య శ్రీ పరిధి పెంపు వంటి రెండు గ్యారెంటీలను అమలు చేయడం జరిగిందని,మిగిలిన గ్యారెంటీలలో భాగంగా గృహ జ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ధర్మపురి నియోజక వర్గంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని,200 యూనిట్ల లోపు విద్యుత్ ఎవ్వరు వినియోగించుకున్న ఎటువంటి డబ్బులు చెల్లించడం అవసరం లేదని,ధర్మపురి మున్సిపల్ లో ఎక్కడైనా కరెంట్ పోల్స్ అవసరం ఉందొ తన దృష్టికి తీసుకురావాలని,దానికి సంబంధించిన నిధులు కూడా మంజూరు చేయించిసమస్యను పరిష్కరిస్తామని,ధర్మపురికి తాగు నీరు అందించే విషయంలో సమస్య పరిష్కారానికీ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఒక కోటి రూపాయలు కూడా కేటాయించడం జరిగిందని,అతి త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ళ పథకం కూడా అమలు చేయడం జరుగుతుందనీ,మిగిలిన గ్యారెంటీల అమలుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ధర్మపురి నియోజక వర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని,రాబోయే రోజుల్లో కూడా ధర్మపురి అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ చైతన్య,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఎస్ ఈ సత్యనారాయణ మున్సిపల్ చైర్మన్ సత్తెమ్మ,వైస్ చైర్మన్ రామన్న, కౌన్సిలర్లు వేముల నాగ లక్ష్మి జక్కు పద్మ, సంగన బట్ల సంతోషి,గరిగే అరుణ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగనబట్ల దినేష్,నియోజక వర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింహ రాజు ప్రసాద్, మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొగిలి,అప్పం తిరుపతి,మహేష్,అశేట్టి శ్రీనివాస్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు