జగిత్యాల నేటి ధాత్రి
ధర్మపురి నియోజక వర్గం ధర్మారం మండల కేంద్రంలోని గౌతమబుద్ధ ఫంక్షన్ హాల్లో శనివారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆద్వర్యంలో మండల నాయకుల ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.తనకు ఓట్లు వేసి ఎమ్మెల్యే గెలిపించిన ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం మండల ప్రజానీకానికి,కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేసిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని,ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, ఈ ప్రాంతానికి సంబంధించి సాగు,త్రాగు నీరు అందించే విషయంలో ఎక్కడ రాజీపడే ప్రసక్తి లేదని,రానున్న ఎంపి ఎన్నికలను సమర్థవతంగా ఎదుర్కోవాలని,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా పనిచేయాలని,నియోజకవర్గంలోనీ ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం ఉన్న తనని నేరుగా కలవవచ్చని,నియోజక వర్గ అభివృద్ధిలో విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలిపారు