జగిత్యాల నేటి ధాత్రి
ప్రజలకు మేలు జరిగే విషయంలో పార్టీలకు అతీతంగా పని చేస్తామని ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ అన్నారు, బుగ్గారం మండలం సిరికొండ గ్రామ పంచాయతీ నూతన కార్యాలయాన్ని బుధవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సావ కార్యక్రమంలో మమల్ని భాగస్వాములను చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని,రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,ఆరోగ్య శ్రీ పరిధి పెంపు వంటి హామీలను అమలు చేయడం జరిగిందని,గత రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల నుండి సరైన పలితాలు రాకపోవడంతో ప్రజలు మార్పు కోరుకోవడం జరిగిందని,కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని,ప్రజలకు మేలు జరిగే విషయంలో పార్టీలకు అతీతంగా పని చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో.సర్పంచ్ చెన్నమల్ల దివ్య ప్రవీణ్ నర్సాగౌడ్ తాండ్ర అశోక్ రావు కుంట మహేష్ బాల్సాని గంగారం బండ్ల గంగరాజు బలుమూరు సురేందర్రావు కేతిరెడ్డి రవీందర్ రెడ్డి జక్కుల సత్తయ్య గాలి పెళ్లి రాయమల్లు సికిరి అంజన్న కండ్లె మదన్ రహ్మత్ ఖాన్ వేముల నరేష్ గజ్జల అంజి పుట్టపాక వెంకటేశ్వర్లు మిట్టపల్లి బండారి సత్యంరావు కుమ్మరి సత్తయ్య కుమ్మరి మరి రాజమల్లు వెంకటేశ్వరరావు నక్క సత్తయ్య బేర తిరుపతి .
బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ ఉపాధ్యక్షులు నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు