జగిత్యాల నేటి ధాత్రి
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాజరాం గ్రామంలో ఎల్లమ్మ తల్లి విగ్రహ పున ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా అమ్మవారినీ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.అమ్మవారి విగ్రహం పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని,ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించాలని మొక్కుకొని ముడుపు కట్టానని, అమ్మవారి దయతో, ప్రజల ధీవెనతో ఎమ్మెల్యేగా విజయం సాధించానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో ఎటువంటి విఘ్నాలు రాకుండా అమ్మవారు చల్లగా చూడాలని మొక్కుకున్నానని,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన,రాష్ట్ర ప్రజలపై అమ్మవారి చల్లని దీవెనలు ఎల్లవేళల ఉండాలని కోరుకుంటున్నట్టు,ఆలయ అభవృద్ధికి ఎటువంటి సహాయ సహకారాలు అవసరం ఉన్న తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలిపారుఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగణభట్ల దినేష్, ఉపాధ్యక్షులు వేముల రాజేష్, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు చిలుముల లక్ష్మణ్, ధర్మపురి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సింహరాజు ప్రసాద్, ఎంపీటీసీ గంగాధర్, అప్పం తిరుపతి సుముక్ మహేందర్,రంగు అశోక్ ఆలయ కమిటీ చైర్మన్ బుర్ర భీమయ్య గౌడ్, స్థానిక నాయకులు ఎండపల్లి మురళి,గౌడ సంఘం సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.