లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన ప్రభుత్వ విప్ అడ్లురీ లక్ష్మణ్ కుమార్

జగిత్యాల నేటిదాత్రి
ఈ నెల 20 తేదీ నుండి ప్రారంభం కానున్న ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు సంబందించిన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం రోజున మండల నాయకులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా నంది చౌరస్తా నుండి దేవాలయం వరకు గల దారిని మరియు పార్కింగ్ స్థలం,త్రాగు నీటి సదుపాయం,గోదావరి వద్ద భక్తుల స్నానాలకు సంబందించిన ఏర్పాట్లను ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ.


ధర్మపురి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని,నూతన ఉత్సవ కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామనీ,కమిటీ సభ్యులు కూడా సమన్వయంతో పనిచేసి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించాలని,ప్రతి ఒక్కరి పై స్వామీ వారి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేవాలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!