ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన నిరుపేదలకు అందజేయాలి

బహుజన సంక్షేమ సంఘం (బిఎస్ఎస్)మరియు దళిత సంఘాలు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రానికి ప్రజా పాలన దరఖాస్తుల తనిఖీ కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలానికి వచ్చిన హన్మకొండ జిల్లా కలెక్టర్ బహుజన సంక్షేమ సంఘం (బిఎస్ఎస్) మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్& మెజిస్ట్రేట్ ప్రావీణ్యకి బహుజన సంక్షేమ సంఘం (బిఎస్ఎస్) ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మొగ్గం సుమన్ వివరిస్తూ తెలంగాణ రాష్ట్రం లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన నిరుపేద ప్రజలకు అందేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా మండలంలోని అన్ని గ్రామాలలో చేస్తున్న సర్వే ఆధారంగా నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, లాంటి పథకాలను లబ్ధి చేకూరే విధంగా కృషి చేయాలని కలెక్టర్ కి తెలిపారు. ఇట్టి సంక్షేమ పథకాలలో ఎటువంటి రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలు ప్రతి నిరుపేద కుటుంబంకి చేరే విధంగా మీ చొరవ ఉండాలని కలెక్టర్ కి తెలిపారు. ఈ విషయంపై కలెక్టర్ సానుకూ లంగా స్పందిస్తూ తప్పకుండా అర్హులైన కుటుంబాలకు ఈ సంక్షేమ పథకాలు చేరే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బహుజన సంక్షేమ సంఘం (బిఎస్ఎస్) మరియు దళిత సంఘాలు నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు కలెక్టర్ కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు మారపల్లి సుధాకర్ (డాన్), మారపేల్లి విజయ్, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!