ఎమ్మెల్యే గా భావించవద్దు, మీ సేవకుడిగా భావించండి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్!!!!
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందిస్తాం ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి!!!
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి!!
ఎండపల్లి జగిత్యాల నేటి ధాత్రి
ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామ నూతన పంచాయతీ కార్యాలయాన్ని శుక్రవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ,ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి ప్రారంభించారు.
ఈ సందర్భంగా .వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ.
గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవం చేసినందుకు ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని,ప్రజల కోసం ఎప్పుడు ఆలోచించి వారి సమస్యల పరిష్కారం విషయంలో ఎప్పుడు ముందుండే వారు జీవన్ రెడ్డి ,లక్ష్మణ్ కుమార్ అని,రోడ్ల విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే ఎమ్మెల్యేలకు ప్రత్యేక నిధులు కటాయించడం జరుగుతుందని,గత ప్రభుత్వం ప్రజల గురించి ఎప్పుడూ ఆలోచించలేదనీ,నేను ఎంపిగా ఉన్న సమయంలో ధర్మపురికి నిధుల విషయంలో పలుమార్లు లక్ష్మణ్ కుమార్ తో చర్చించడం జరిగిందనీ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తామని, ఈ సందర్భంగా తెలిపారు.లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.
కొండాపూర్ గ్రామానికి నాతో అభినవ సంబంధం ఉందని,నన్ను ఎప్పుడు ఒక కుటుంబ సభ్యుడిగానే గ్రామస్థులు భావించేవారనీ,ఈ గ్రామానికి సంబందించిన రోడ్ల విషయంలో,సాగు నీరు అందించే విషయంలో సంబంధిత అధికారులతో మాట్లాడటం,జరిగిందని,కొండాపూర్ గ్రామానికి ఎప్పుడు ఏ అవసరం తన దృష్టికి తీసుకురావాలని,తన పరిధిలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.తన రాజకీయ జీవితానికి అంకురార్పణ జరిగింది కొండాపూర్ గ్రామం నుండేనని,లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యేగా ఈ స్థాయిలో ఉండటానికి ఎంతో శ్రమించారని,ధర్మపురి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాటి పర్తి రాజవ్వ,,ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగణ బట్ల దినేష్, ఉమ్మడి వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలెందర్ రెడ్డి,గొల్లపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి, గురువారెడ్డి,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్,ఎంపీపీ లక్ష్మి,ఎంపిటిసి జాడి సుజాత రాజేశం,ఎండ పల్లి ఎంపిటిసి మహ్మద్ బషీర్ సర్పంచ్ లు అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు