ఎల్ఆర్ఎస్ 2020 స్కీం పై ప్రభుత్వం రాయితీ….
మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
2020 వ సంవత్సరంలో ప్లాట్ ను ఎల్ఆర్ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేసుకోవడం వలన రాష్ట్ర ప్రభుత్వం భూమి రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద ఫీజు పై 25 శాతం రాయితీ ప్రకటించినట్లు మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులరైజ్ చేసిన ఫ్లాట్లకు భవన అనుమతులు సులభంగా అందుతాయని, మార్కెట్ విలువను డాక్యుమెంట్ విలువ ఆధారంగా అంచనా వేయబడుతుందని, బ్యాంకు లోన్ ప్రాసెసింగ్ సమయంలో ప్రయోజనాలు ఉంటాయని, భవన నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు 33% జరిమానా చార్జీలను నివారించవచ్చని కమిషనర్ తెలిపారు.