బెట్టింగ్‌ బేవార్స్‌ గాళ్లు?

 

`తుక్కు రేగ్గొడితేనే గాని దారికి రారు!

`ప్రమోషన్‌ పేరుతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు.

`11 మందిపై కేసు నమోదు?

`సినీ పెద్దలెంతో మంది ప్రమోటర్లుగా వున్నారు?

`వాళ్లకు నోటీసులతో సరిపెడతారా?

`వాళ్లను కూడా అరెస్టులు చేస్తారా?

`చిన్న చిన్న చేపల మీదనే ప్రతాపం చూపిస్తారా?

`కొందరు సినీ పెద్దల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

`హీరోలు రానా, విజయ్‌ దేవరకొండ, ప్రకాశ్‌ రాజ్‌ లాంటి వాళ్లున్నాంటున్నారు.

`టీవి ఛానళ్లలో పేరు పొందిన యాంకర్లు వున్నారు.

`మంచు లక్ష్మి లాంటి వాళ్లు కూడా ప్రమోట్‌ చేశారంటున్నారు.

`మరి వాళ్లందరికీ నోటీసులు ఎప్పుడు అందిస్తారు.

`అరెస్టు చేయబడిన వారు తమకేం పాపం తెలియదంటున్నారు.

`వర్షణి, శ్రీముఖిలపై కేసులు నమోదయ్యాయి.

`ఇప్పటి వరకు 25 మంది సినీ సెలబ్రిటీలపై ఆరోపణలు వున్నాయి.

`దేశ వ్యాప్తంగా ధోని లాంటి క్రికెటర్లు కూడా బెట్టింగ్‌ యాప్‌లు ప్రమోట్‌ చేశారు.

`దేశంలో కొన్ని వేల మంది బెట్టింగ్‌ యాప్‌ లను ప్రమోట్‌ చేశారు.

`కోట్లాది మంది నష్టపోయారు.

`కొన్ని రాష్ట్రాలలో బెట్టింగ్‌ యాప్‌లకు అనుమతులున్నాయి.

hyderabad,Netidhathri: 

 అడ్డదారిలో అక్రమార్జన సాగించాలని చూసే వారు సమాజంలో రోజు రోజుకూ పెరిగిపోతున్నారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలన్న ఆశలు వారికి తెలియకుండానే ఉచ్చులో ఇరుక్కుంటున్నారు. రూపాయి పెట్టుబడికి పది రూపాయల లాభం అనగానే ఆశపడుతున్నారు. సంపాదన సంగతి పక్కన పెడితే డబ్బులు పోగొట్టుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అప్పుల పాలౌతున్నారు. ఆస్థులు పొగొట్టుకుంటున్నారు. జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నాడు. బెట్టి ఆప్‌లు పెట్టిన వాడు బాగానే వుంటున్నాడు. ఆప్‌లను ప్రమోట్‌ చేస్తున్నవాడు సంతోషంగానే వుంటున్నాడు. ఆడిన వాడు తిరుక్షవరమైపోతున్నాడు. betting app లో పెట్టుబడి పెట్టి మోసపోయిన వాళ్లు తెలంగాణలోనే కొన్ని లక్షల మంది వున్నారు. ఇప్పుడు లబోదిబో మంటున్నారు. police స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. కొంతమంది కేసులు ఎదుర్కొంటూ jail పాలౌతున్నారు. influencer గా మారి అమాయక జనాన్ని ముంచిన వాళ్లు తప్పించుకు తిరుగుతున్నారు. అయితే చట్టాల మీద అవగాహన లేక ప్రచారం చేసిన వాళ్లు కొంతమంది. కానీ సినీ రంగంలో ఉన్నత స్థానాలలో వున్న వారు కూడా బెట్టింగ్‌ యాప్‌లను ఎందుకు ప్రమోట్‌ చేశారన్నదే వెలుగులోకి రావాల్సి వుంది. చానల్‌ యాంకర్లు, చిన్న చిన్న పాత్రల ద్వారా నిత్యం ప్రేక్షకులను అలరించే వాళ్లు సంపాదన మీద మక్కువతో చేశారంటే అర్థం వుంది. కానీ నిత్యం నైతిక విలువల గురించి మాట్లాడే ప్రకాశ్‌ రాజ్‌ కు చట్టాలు తెలియవా? శిక్షలు పడతాయని తెలియదా? betting app ల ప్రమోషన్‌ నేరమని తెలియదా? వాటి వల్ల ప్రజలకు మేలుకన్నా నష్టమే ఎక్కువ అని తెలియనంత అమాకుడా? సినిమాలలో నటించేందుకు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌ తీసుకునే హీరోలు ఇదేం పాడు పని. హీరోలంటే ఆదర్శంగా వుండాలి. లక్షలాది మంది అభిమానులు వారిని ఆరాధిస్తుంటారు. సినిమాలలో మంచికి ప్రతి రూపంగా కనిపించే హీరోలు నిజ జీవితంలో విలన్‌లుగా మారాల్సిన అవసరం ఏమొచ్చింది. హీరోలుగా చేస్తే కోట్లు వస్తాయి. నిర్మాతలుగా కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు నిర్మిస్తారు. betting app ల ప్రమోషన్‌తో అంతకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారా? సామాన్యులకు లేని పోని మాటలు చెప్పి, ఊహల పల్లకి ఎక్కించి బెట్టింగ్‌ యాప్‌లలో డబ్బులు పోగొట్టుకునేలా చేయడం నేరం కాదా? పైగా telangana, ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రాలలో బెట్టింగ్‌ యాప్‌లు నిషేధం. వాటి promotion సాగించడం చట్టరిత్యా నేరం. అందుకు సెక్షన్లు …..నమోదు చేస్తారు. కేసులను ఎదుర్కొంటారు. జైలు పాలౌతారు. ఈ మాత్రం అవగాహన ఇతర యూ ట్యూబర్లకు అవగాహన లేదనుకుంటే అర్థం చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే కొన్ని వేల కుటుంబాలలో బెట్టింగ్‌ యాప్‌లు చిచ్చుపెట్టాయి. అందులో పెట్టుబడి పెట్టిన అనేక కుటుంబాలు వీధిన పడ్డాయి. nalgonda, warangal  జిల్లాలలో ఇప్పటికే అనేక మంది యువకులు అరెస్టయ్యారు. కేవలం ఈజీ మనికి అలవాటు పడడమే ఇందుకు కారణం. ఇక బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్‌ చేసిన వారికి పెద్ద మొత్తంలో అందుతున్నట్లు సమాచారం. తాజాగా పోలీసుల విచారణలో vishnupriya కీలక విషయాలు వెల్లడిరచించినట్లు సమాచారం. ఆమె ఇప్పటి వరకు సుమారు 25 app లను promote చేసినట్లు అంగీకరించారు. ఒక్కో యాప్‌ నుంచి సుమారు లక్ష వరకు లబ్ధి పొందినట్లు తెలుస్తోంది. దేశంలో ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో లాటరీలున్నాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో బాగ్యలక్ష్మి బంపర్‌ లాటరీ అని వుండేది. దేశంలో కేరళ లాటరీ ఫేమస్‌. ఈ మధ్య విడుదలైన lucky Bhaskar ‌ సినిమాలో కూడా లాటరీ గెలుపులో మతలబు ఏముంటుందనేది కళ్లకు కట్టినట్లు చూపించారు. అయినా ఇప్పటికీ మహారాష్ట్ర తో పాటు అనేక ఉత్తరాధి రాష్ట్రాలలో సింగిల్‌ నెంబర్‌ లాటరీలున్నాయి. కానీ మన తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడో బ్యాన్‌ చేశారు. ఆ తర్వాత మరో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. చైన్‌ సిస్టం మార్కెటింగ్‌ మోసం వల్ల లక్షల కుటుంబాలు నష్టపోయాయి. అయినా ఇప్పటికీ వాటి ఆనవాలు కనిపిస్తూనే వుంది. అయితే YouTube channel‌ వచ్చి బెట్టింగ్‌ యాప్‌ల ప్రచారానికి కేంద్రమైంది. పెద్ద ఎత్తున పుట్టుకొచ్చిన యూట్యూబర్లు, వెబ్‌ సిరీస్‌లు రూపొందించే వాళ్లు, నటీనటులు ఈ యాప్‌ల ప్రమోషన్‌ మొదలుపెట్టారు. యాప్‌ల ప్రమోషన్‌ కోసమే వెబ్‌ సిరీస్‌లు తీస్తున్న సంస్థలున్నాయి. నటీనటులున్నారు. వాళ్ల సంఖ్య తక్కువేం కాదు. మన తెలుగు రాష్టాలలోనే కొన్ని వేల మంది వున్నారు. మరి అంత మందికి నోటిసులు పంపే అవకాశం వుంటుందా? నాలుగు రోజులు హడావుడి చేసి కేసులను అటకెక్కిస్తారా? ఎందుకంటే గతంలో డ్రగ్స్‌ కేసుల విషయంలో ఇలాగే హడావుడి చేశారు. ఇప్పుడు ఆ కేసు ఏమైందో తెలియదు. దాని పురోగతి ఎంత వరకు వచ్చిందో సమాచారం వుండదు. అలాగే బెట్టింగ్‌ యాప్‌లను దేశ వ్యాప్తంగా నిషేదిస్తారో లేదో చూడాలి. వాటి ప్రమోషన్‌ ఆగిపోతుందో లేదో కొంత కాలం గడిస్తే గాని తెలియదు. పైగా ఈ కేసు కోర్టులలో నిలుస్తుందో లేదో కూడా న్యాయ నిపుణులు చెప్పాలి.

betting app case in telangana many actors names in FIR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!