నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:
అకాల తుఫాను వర్షాల కారణంగా చండూరు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ప్రత్తి పంట, ఇతర పంటలువేసుకున్న రైతులు నష్టపోయారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్ అన్నారు. శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలో రైతులు వేసుకున్న ప్రత్తి పంటను సిపిఎం ప్రతినిధి బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల కురిసిన వర్షాల వలన తెల్ల బంగారం ఎర్ర బారిందని ఆయన అన్నారు. చండూరు మండలంలోని వివిధ గ్రామాల్లో పత్తి పంట మరియు వివిధ పంటలు వేల ఎకరాల్లో నష్టపోయారని మా దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు.మండల పరిధిలోనిఏ గ్రామాలలోఏ పంట నష్టపోయిందోవ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు జాయింట్ గా కలిసి పంటల వారిగా సర్వే చేసి, ఏ పంట ఎంత నష్టపోయారో ప్రభుత్వానికి అందజేసి,నష్టపోయినరైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. వ్యవసాయానికి పెరుగుతున్న రేట్లకు అనుగుణంగావిత్తనాలు,ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన రిత్యా ఎకరానికి 25 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించి, రైతాంగానికి ఆదుకోవాలనిఆయన అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షలు రుణమాఫీ చేయాలని, రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేనిపక్షంలో రైతులందరినీ కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలోసిపిఎం నేర్మ ట గ్రామ శాఖ కార్యదర్శి బల్లం స్వామి, రైతు సంఘం నాయకులుకొత్తపల్లి నరసింహ,గ్రామ రైతులుకొంపెల్లి ఉషయ్య, మాధగోని హనుమంతు, బుర్కల అంజయ్య, ఈరగట్ల యాదయ్య, నారాపాక లింగాలు, ఈరటి వెంకన్నతదితరులు పాల్గొన్నారు.