మాదిగ అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
◆ – అబ్రహం మాదిగ
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలో దండోర ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించి అమరులైన మాదిగ అమరవీరులకు జహీరాబాద్ లోని స్థానిక అతిథి గృహంలో ‘ఉల్లాస్ మాదిగ’ ఎమ్మార్పిఎస్ జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి ఆద్వర్యంలో ఎమ్మార్పీఎస్ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు.
అబ్రహం మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో సాగిన ముప్పై యేండ్ల ఎమ్మార్పీఎస్ పోరాటం ఫలితంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించడం హర్షనీయమన్నారు. యావత్ మాదిగ జాతి మందకృష్ణ మాదిగ గారికి ఋణపడి ఉంటుందని అన్నారు. మాదిగ జాతి విజయం సాధించిన ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో పనిచేస్తూ అమరులైన (అమృత్,ప్రకాష్,రవీందర్, బాలరాజ్,మొల్లప్ప,భూమన్ మధు,పద్మారావు) ఉద్యమ వీరులకు నివాళులు అర్పించడం మాదిగ బిడ్డలుగా మన నైతిక బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. ఎంతో మంది త్యాగాలు ఉద్యమాన్ని విజయ తీరాలకు నడిపించాయని అన్నారు. వారు ఉద్యమమే ఊపిరిగా జీవించారని వారి స్ఫూర్తి, త్యాగం, అమరత్వం చిరస్మరణీయంగా నిలిచిపోతుందని కొనియాడారు.
ఈ ముప్పై యేండ్ల కాలంలో ఎమ్మార్పిఎస్ ఉద్యమంలో జహీరాబాద్ నియోజకవర్గంలో పనిచేస్తూ చనిపోయిన మాదిగ అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.జిల్లా వ్యాప్తంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమంలో పనిచేస్తూ అమరులైన కుటుంబాల వివరాలు సేకరిస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు చొరవ తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో..నవీన్ కూమార్ ఎంజేఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి,అరుంధతి సంఘం నాయకులు రాంచందర్, జె జైరాజ్ ఎమ్మెఎస్పి నాయకులు జైరాజ్,పద్మారావు
ఆయా మండలాల అధ్యక్షులు టీంకు మాదిగ,మైకల్ రాజ్, రవికుమార్, నిర్మల్,మాదిగలు మరియు నాయాకులు సుకుమార్, శ్రీనివాస్,అజయ్, సుధాకర్,సునీల్,కిట్టు,అనిల్,పవన్,దయానంద్,ప్రశాంత్, రమేష్,షాలేం,సుదీష్ మాదిగలు తదితరులు పాల్గొన్నారు.