ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ..
భూపాలపల్లి నేటిధాత్రి
ప్రభుత్వం అన్న దాతల ఉసురు తీసుకుంటుందని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి అధికారంలోకి రాకముందు రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తదని అధికారం లోకి రాగానే 2 లక్షల ఋణమాఫీ, రైతు భరోసా కింద ఎకరానికి 15000/- రూపాయలు, అదేవిధంగా కౌలు రైతులకు కూడా పెట్టుబడి సహాయం అందిస్తామని ప్రగల్బాలు పలికి ఓట్లు దండుకుని, అధికారంలోకి రాగానే ఆహామీలను పూర్తిగా మరిచిపోయారని అన్నారు. 2లక్షల రూపాయల ఋణ మాఫీకి అనేక కోర్రిలు పెట్టడం మూలంగా కేవలం 40% మంది రైతులకే మాఫీ అయ్యిందని, మిగిలిన 40% మంది రైతులు వ్యవసాయ అధికారుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2లక్షల రూపాయల పైన ఉన్న రైతులుకు మాఫీ ఐతదో! కాదో! అనే సందిగ్ధం లో రైతులు ఉన్నారని, వానకాలం పంటలు వేసి 2 నెలలు ఐతుందని ఇప్పటివరకు కూడా రైతు భరోసా పథకం అమలు చేయలేదని, రైతులు పెట్టుబడికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని,బ్యాంకులో ఋణం మాఫీ కాక ప్రయివేట్ వ్యక్తుల దగ్గర అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నారని, కౌలు రైతులను గుర్తిస్తాం వారికి కూడా రైతు భరోసా పథకం అమలు చేస్తామన్నా ప్రభుత్వం ఇప్పటి వరకు ఆదిశగా చర్యలు తీసుకోవడంలో విఫలం అయ్యిందని, ఎద్దు ఏడ్చిన ఏవుసం! రైతుఏడ్చిన రాష్టం బాగుపడ్డట్టు చరిత్రలో లేదని ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఎలాంటి షరతులు లేకుండా రైతులందరకి 2లక్షల ఋణమాఫీ, రైతుభరోసా పథకం, మరియు కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని అమలు చేసి రైతంగాన్ని ఆదుకోవాలని ఆయన కోరారు..