హైదరాబాద్: 09-02-2024
ఆటో కార్మికులకు నెలకు పదివేల సహాయాన్ని బడ్జెట్ లో ప్రవేశ పెట్టాలి..
ఆటో కార్మికుల ఆత్మహత్య లన్ని ప్రభుత్వ హత్యలే…
–పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. బి ఆర్ ఎస్ పార్టీ శాసన మండలి సభ్యులు.
తెలంగాణ రాష్ట్రంలోని ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని , వారికి నెలకు పదివేల రూపాయల సహాయాన్ని వెంటనే బడ్జెట్ లో ప్రవేశ పెట్టాలని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మేల్యేలు , ఎమ్మెల్సీలు హైదర్ గూడ ఎమ్మేల్యే క్వార్టర్స్ నుండి అసెంబ్లీ వరకు ఆటో ర్యాలీ నిర్వహించి అసెంబ్లీ , శాసన మండలి ఆవరణలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది.