మేరు కులస్తులను బి.సి (ఎ) లో చేర్చాలి
మండల మేరు సంఘం అధ్యక్షులు కీర్తి రాజ్ కమల్
మేరు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు
పాలకుర్తి నేటిధాత్రి
కుట్టు మిషన్ వృత్తి దారులను ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవాలని, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన మేరు కులస్తులను బి.సి (ఎ) లో చేర్చాలని మేరు సంఘం పాలకుర్తి మండల అధ్యక్షులు కీర్తి రాజ్ కమల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుట్టు మిషన్ సృష్టి కర్త విలియమ్ ఎలియాస్ హో జన్మదినం ఫిబ్రవరి 28 తేదీ ని పురస్కరించుకుని టైలర్స్ డే వేడుకలను మేరు సంఘం భవనంలో ఏర్పాటు చేయగా కీర్తి రాజ్ కమల్ మేరు కుల దైవం శ్రీ శ్రీ శ్రీ జఠగిరి శంకర దాసమయ్య, విలియమ్ ఎలియాస్ హో చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. సమాజంలో కుట్టు మిషన్ వృత్తి పై ఆధారపడిన మేరు కులస్తుల జీవనం రెక్కాడితే డొక్కాడని విధంగా అగమ్యగోచరంగా మారిందని, రెడిమేడ్ దుస్తుల పరిశ్రమలతో బతుకు కుదేలై చాలీ చాలని పనులతో కొట్టుమిట్టాడుతున్న మేరు కులస్తులకు ప్రభుత్వం కమీషన్ ను ఏర్పాటు చేయాలని, తిరిగి చెల్లించని ఋణాలను, వడ్డీ లేని ఋణాలను, అందించాలని, ప్రతి కుంటుంబానికి ఆటో మెటిక్ జుకీ మిషన్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి సోమ వెంకన్న, జిల్లా సహాయ కార్యదర్శి సోమ సత్యం, మండల ప్రధాన కార్యదర్శి కొత్తకొండ వాసు, మండల సహాయ కార్యదర్శి గూడూరు లెనిన్, మండల ఉపాధ్యక్షులు సోమ సోమరాములు, పొడి శెట్టి ప్రభాకర్, సోమనర్సయ్య, గూడూరు నరేష్, వీరాస్వామి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.