• గ్రామసభలను సద్వినియోగం
చేసుకోవాలి
• మండల ప్రత్యేక
అధికారి
వినయ్ కుమార్
నిజాంపేట: నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హత కలిగిన లబ్ధిదారుల వివరాలను సేకరించి గ్రామ సభలో ప్రజలకు తెలపడం జరిగిందని మండల ప్రత్యేక అధికారి వినయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో భాగంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సభను ఏర్పాటు చేసి మాట్లాడారు.. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. గ్రామంలో ప్రజల నుండి అభ్యంతరాలను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో రాజిరెడ్డి, మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, ఏఈఓ శ్రీలత, కార్యదర్శి భాగ్యలక్ష్మి, గ్రామస్తులు పాల్గొన్నారు.