https://epaper.netidhatri.com/view/301/netidhathri-e-paper-25th-june-2024%09
`శ్మశానం కూడా వదలరా!
`సమాధులు తవ్వేస్తారా!
`అధికారులొచ్చారు!
`కూల్చినట్లు నటించారు!
`నాలుగు రేకులు తొలగించి మమ అనిపించారు!
`‘‘శ్మశాన వాటిక ఆక్రమణకు సహకరించిన వారెవరు?
`‘‘సిఎంవో’’ ఆదేశాలనే దిక్కరిస్తున్నవారెవరు?
`రియల్ వ్యాపారులకు కొమ్ము కాస్తున్నవారెవరు!
`కాసుల కక్కుర్తి కోసం దిగజారుతున్న వారెవరు?
`‘‘సిఎంవో’’ ఆదేశాలు బుట్ట ధాఖలు చేస్తున్నారు.
`రియల్ వ్యాపారులకే సహకరిస్తున్నారు.
`అమ్మవారి గుడి స్థలంలో ఇదే చేస్తున్నారు.
`అక్కడ కూడా రియల్ కే లొంగిపోతున్నారు.
`గుడి స్థలం పార్క్‌గా మారుస్తుంటే గుడ్లప్పగించి చూస్తున్నారు.
`ప్రభుత్వ స్థలాలు ప్రైవేటు పరానికి సహకరిస్తున్నారు.
`పాపం మూటగట్టుకుంటారు.
`ముడుపులు కోసం ఆశపడుతున్నారు.
`అమ్మ వారి పూజలకే స్థలం లేకుండా చేస్తున్నారు.
`7వందల ఏళ్లుగా సాగుతున్న జాతరకు జాగ లేకుండా చేస్తున్నారు.
`అమ్మ వారికి బోనాలు సమర్పించేందుకు స్థలం లేకుండా చేశారు.
హైదరాబాద్,నేటిధాత్రి:
మీ దుంపల్‌తెగ…ఇదేం దిక్కుమాలిన వ్యాపారం..రా నాయనా? స్మశానాలను కూడా వదలరా? అక్కడ కూడా ఆత్మలకు ప్రశాంతత లేకుండా చేస్తారా? అక్కడ బిల్డింగులు కట్టి, ఆ కుటుంబాలతో దెయ్యాలను కుటుంబ సభ్యులు చేస్తారా? ఎక్కద దాపురించారురా? వ్యాపారం పేరుతో ఏదైనా చేస్తారా? సంపాదన కోసం ఆత్మలను కూడా వాడుకుంటారా? ఇంత దిక్కుమాలిన వ్యాపారం ఎదీ వుండదేమో? ఎక్కడా వుండదేమో? వ్యాపారం అంటే రియల్ వ్యాపారం తప్ప తెలంగాణలో మరొకటి కనిపించడం లేదు. రియల్ వ్యాపారం అంటే కబ్జాలు లేకుండా ఎక్కడా వ్యాపారం సాగడం లేదంటే అతిశయోక్తి కాదు. అందులోనూ అసైన్డ్ ల్యాండ్‌లు వదిలిపెట్టరు. చెరువు శిఖాలను వదిలేయరు. ఆఖరుకు చెరువులనే వదిలేయడం లేదు. అని నిన్నటిదాక చెప్పుకునేవాళ్లు. కాని ఇప్పుడు రియల్ వ్యాపారంలోకి శ్మశానాలు కూడా చేరిపోయాయి. ఊరన్న తర్వాత స్మశానం వుండాలి. పట్నమన్న తర్వాత వైకుంఠ దామాలు కనిపించాలి. కాని వాటిని కనిపించకుండా చేయడమే రియల్ వ్యాపారంలో ఒక భాగమైపోయింది. ఒకప్పుడు స్మశాన వాటికల ముందునుంచి వెళ్లాలంటేనే జనం భయపడేవారు. అలాంటి ప్రజలను ఏకంగా వారికి తెలియకుండా, మోసం చేస్తూ స్మశానాలును కబ్జాపెట్టేవాళ్లు, వాటి ఆనవాళ్లు లేకుండా చేసిన అంతస్థులు కట్టేస్తున్నారు. దర్జాగా అమ్మేస్తున్నారు. కొనుకున్నవారికి ముందు తెలికపోయినా, తర్వాత తెలిసినా చేసేదేమీ వుండదు. మోసమోయిన తర్వాత మొర ఎవరూ ఆలకించరు.
ఇంతకీ ఏం జరిగింది:
అది షేక్ పేట..ఓ ముప్పై ఎకరాల ప్రభుత్వ స్ధలం. దానిని ఆనుకొని కొన్ని శతాబ్దాలుగా స్మశాన వాటిక వుంది. అనాదిగా అక్కడ చనిపోయిన వారి దహన సంస్కారాలు చేస్తుంటారు. సమాధాలు నిర్మించారు. సంప్రదాయాల ప్రకారం అక్కడ సమాధులు వున్నవారి బంధువులు ఏటా అక్కడికి చేరుకొని వారి ఆత్మలకు శాంతి చేకూర్చుతుంటారు. వారి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. ఆ కుటుంబ సభ్యులు లేని లోటును అలా తీర్చుకుంటారు. కాని ఇప్పుడు వారికి ఆ అవకాశం కూడా లేకుండా సుమారు రెండు లక్షలకు పైగా జనాలు నివాసముండే షేక్ పేట ప్రాంతంలో వున్న ఏకైక స్మశాన వాటికను కబ్జారాయుళ్లు ఆక్రమించేసుకున్నారు. అందుకు ప్రభుత్వ పెద్దలు సహకరించారు. అధికారులు అండగా నిలిచారు. అక్రమమైనా అన్ని అనుమతులిచ్చారు. దగ్గరుండి అన్ని సౌకర్యాలు చూసుకున్నారు. కాగితాలు చేతిలోపెట్టి సాగనంపారు. ఇక కబ్జా చేసిన వాళ్లు ఊరుకుంటారా? రాత్రికి రాత్రి ఆ స్ధలం చుట్టూ రేకులు ఏర్పాటు చేశారు. లోపల సమాధులు తవ్వే కార్యక్రమం పెట్టుకున్నారు. ఈ విషయం ఆనోట ఈనోట ప్రచారం జరిగింది. కొంత మంది స్ధానికులు నేటిధాత్రికి సమాచారం అందించారు. దాంతో నేటిధాత్రి సమాచార సేకరణ చేపడితే విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఒక రకంగా స్మశానం అంటే కూడా ఒక పవిత్రమైన స్ధలమే. కాని అది చనిపోయిన వారు శాశ్వత నిద్రలో వుండే స్ధలం. ఆ స్ధలం వైపు కన్నెత్తి చూడాలంటేనే చాలా మంది భయపడుతుంటారు. కాని కబ్జారాయుళ్లు గుళ్లనే మింగేస్తున్నారు. స్మశానాలు మాకో లెక్క అని వాటిని కూడా రియల్ వ్యాపారంలో పెట్టేస్తున్నారు. ఈ విషయం మీడియాలో వార్తగా మారింది. నేటిధాత్రి స్మశానం కబ్జా చేయడం ఏమిటి? అధికారులు ఏం చేస్తున్నారని ఆరా తీసింది? దాంతో అధికారులు రంగ ప్రవేశం చేశారు..ఇక్కడ మరో జరిగిన విషయం మరింత విచిత్రం. జూబ్లిహిల్స్ మహా ప్రస్తానం అభివృద్దికోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిన సమయంలోనే, షేక్ పేటలోని 5 ఎకరాల, 20 గుంటల స్మశాన వాటిక అభివృద్దికోసం కూడా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కాని ఈ రియల్ వ్యాపారులు అక్కడ అభివృద్దిపనులు జరకుండా మేనేజ్ చేసుకున్నారు. నిధులు విడుదలను అడ్డుకున్నారు. ఈ స్మశాన వాటికకు ప్రభుత్వం నిదులు ఇచ్చి, అభివృద్ది చేస్తే, మిగత 327పైకిలోని మిగతా భూమి అంతా ప్రభుత్వ స్ధలం అని తెలిసిపోతుందని తెలివిగా మున్సిపల్ అధికారుల సహాకారంలో వాటిని అడ్డుకున్నాడు. అక్కడ పనులు జరగకుండా చూసుకున్నాడు. ఇప్పుడు అదును చూసి ఆ స్ధలం చుట్టూ రేకుల కంచె వేశారు. సమాధులను తవ్వే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇదీ అసలు సంగతి.
మా పని మేం చేస్తున్నాం..అని మమ అనిపించారు:
సహజంగా అధికారులకు ఏదైనా సమాచారం అందితేనే వెంటనే స్పందిస్తారు. కాని మన అధికారులు అలా కాదు. కొంత మంది అదికారులు తమ పై అదికారులకన్నా, రియల్ వ్యాపారులు చెప్పినట్లే చేస్తుంటారు. అందుకు ఈ షేక్‌పేటలో జరుగుతున్న వ్యహహారమే నిదర్శనం. స్మశాన వాటిక కబ్జా విషయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలుసు. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో వున్నప్పుడు ఆ స్థలాన్ని పరిశీలించారు. ఇది ప్రభుత్వ భూమి అని గతంలోనే ప్రకటించారు. ప్రభుత్వభూమిని గత పాలక పెద్దలు ప్రైవేటు వ్యక్తులు ఇవ్వడాన్ని తప్పు పట్టారు. దాంతో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్ధలంలో ఎలాంటి వివాదాలు వుండకూడదన్నారు. అక్కడ ఎలాంటి నిర్మాణాలకు అనుమతులివ్వొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు అధికారులను హెచ్చరించారు. కాని కింది స్ధాయి అదికారులు సిఎంవో అదికారుల హెచ్చరికలు కూడా బేకాతరు చేశారు. స్మశాన వాటికలో నిర్మాణాలకు అనుమతులిచ్చారు. దాంతో కబ్జా రాయుళ్లు అక్కడ చకచకా పనులు మొదలు పెట్టారు. కాని నేటిధాత్రి వదిలిపెట్టలేదు. దాంతో అధికారులు కొంత ఒత్తిడికి లోనైనట్లు నటించి, అటు స్వామి కార్యం, ఇటు స్వకారం జరినట్లుగా ఫోటోలు మీడియాకు విడుదల చేశారు. రేకులను తొలగించినట్లు మీడియాకు ఫోటోలు వలిరారు. మీడియా కూడా నిజమే అనుకున్నది. కాని నేటిధాత్రికి అనుమానమొచ్చింది. రేకులు తొలగిస్తే మొత్తం రేకులు తొలగించిన ఫోటోలు రావాలి. కాని సగం రేకులు కూల్చి, మిగతా వాటిని ఎలా వుండనిచ్చారన్నదానిపై ఆరా తీసింది. దాంతో అసలు విషయం వెలుగు చూసింది. కూల్చేస్తున్నామా..అంటే అవును అనిపించుకునేలా మమ అనిపించారు. నాలుగు రేకులు కూల్చి వేసిన ఫోటోలు పంపించారు. కాని అధికారులకు కూడా ఆ రేకులు కూల్చేసేందుకు మనసు రాలేదు. కబ్జా దారుల నుంచి అప్పటికే ముట్టాల్సినంత ముట్టింది. అలా మడుపులు తీసుకున్న తర్వాత రియల్ వ్యాపారులకు న్యాయం చేయాలి. అందువల్ల ఇలా కానిచ్చారు. పని చేశామని మరిపించారు. అదే మాజీ మంత్రి మల్లారెడ్డి లాంటి వారి పెద్ద పెద్ద బిల్డింగులు ఒక్క పూటలో కూల్చినప్పుడు, ఇక్కడ స్మశాన వాటిక కబ్జాను అదికారులు ఎందుకు అడ్డుకోవడం లేదు. మొత్తం రేకులు ఎందుకు కూల్చేయలేదు? అసలు తిరకాసు ఇక్కడే వుంది. కాసులకు అమ్ముడుపోయి తేలుకుట్టినట్లు వ్యవహరించాల్సి వస్తోంది.
స్మశానమే కాదు..గుడి స్థలం కూడా మింగేస్తుంటే చూస్తున్నారు:
ఈ పక్క స్మశాన వాటిక వుంటే అదే సర్వేనెంబర్ 327 పైకి అనే దాంట్లో ఓ గట్టు వుంది. అక్కడ అమ్మవారి గుడి వుంది. గుడి ముందున్న స్థలం అమ్మవారి జాతర కోసం మూడు వందల ఏళ్లుగా ఉపయోపగపడుతోంది. ఇప్పుడు ఆ స్ధలంపై కూడా రియల్ వ్యాపారుల కన్ను పడిరది. గుడి ముందున్నస్ధలం కూడా కొట్టేయడానికి అదికారుల సహకారం పూర్తి స్ధాయిలో ఉపయోగపడిరది. కాకపోతే ప్రజల నుంచి వ్యతిరేక ఎదురౌతుందని తెలిసి రియల్ వ్యాపారి ఎంత ఉదారంగా ఓ 1700 గజాల స్ధలం పార్కుకోసం కేటాయించినట్లు ప్రకటించబడిరది. ఎవరి భూమి? ఎవరు దానం చేస్తున్నారు? ఎవరి దానమిస్తున్నారు? ఎవరిని ఉద్దరించాలని ఇచ్చామంటున్నారు? ఆ స్ధలం అమ్మవారు స్వయంగా వెలిసిన మూర్తి. అక్కడ సుమారు మూడు దశాబ్ధాలకు పైగా అమ్మవారు పూజలందుకుంటున్నారు. అసలే బోనాల జాతర మొదలయ్యే సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో పెద్దఎత్తున నగర ప్రజలు ప్రతి ఇంటిలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా చేసుకుంటారు. నగరంలో ప్రతి ఏడాది బోనాల పండుగ జరగడం కూడా అనాదిగా వస్తున్న ఆనవాయితీ. అలాగే ఇక్కడ కూడా అమ్మవారు కొన్ని లక్షల కుటుంబాలకు ఇల వేల్పు. అయినా రియల్ వ్యాపారులు భరి తెగించి అమ్మవారికి నిత్య కైంకర్యాలు అందకుండా, దీప దూప నైవేద్యాలతో పూజలు జరక్కుండా చేసేందుకు, అక్కడ రియల్ వ్యాపారం చేసి, అమ్మవారి భూమిని ఆక్రమించేసుకున్నారు. అసలు అమ్మవారి గుడి స్ధలం ఆక్రమించడం తప్పు…నేరం. అలాంటి వారిని అడ్డుకోవాల్సిన అదికారులు వారికి సహకరించడం కూడా నేరం. కాని అధికారులు విచ్చలవిడి తనానికి, అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారు. అందుకే నిత్యం తెలంగాణలో ఎంత మంది అధికారులు పట్టుపడుతున్నా వారిలో భయం లేదు. కారణం తన జీవితంలో జీతంతో వచ్చే సంపాదనకు కొన్ని రెట్లు ఇప్పటికే సంపాదించుకున్నారు. అధికారులు కూడా కోట్లకు పడగలెత్తారు. దాంతో ఉద్యోగం ఊడుతుందన్న భయం లేదు. వచ్చేదంతా లాభమే అన్నట్లు, ఒక వేళ కొలువు పోయినా, మళ్లీ తెచ్చుకునే రాచ మార్గాలున్నాయన్న తెగింపుతో కూడా ఇలాంటి అక్రమ వ్యాపారాలకు సహకరిస్తున్నారు. ప్రతిపలాలు తీసుకుంటున్నారు. వాటి ముందు జీతాలు దిగదుడుపు చేసుకుంటున్నారు. ఒక్కసారిగా వచ్చే ముడుపులతో విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు. ప్రజలను ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. పాలక పెద్దల ఆశీస్సులు కూడా ఇలాంటి వారికే వుండడంతో కొందరు అదికారులు రెచ్చిపోతున్నారు. నిత్య సంపాదనలకు ఎగబడుతున్నారు. అక్రమ వ్యాపారులకు తోడుగా నిలుస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుంటే దీని వెనక వున్న అక్రమ వ్యాపారులే కాదు, తిమింగలాలు కూడా బైటకు వస్తాయి. ప్రభుత్వ స్ధలాలు అన్యాక్రాంతం కాకుండా వుంటాయి.