CPM Demands Action on Land Encroachment
భూ కబ్జా దారుల నుండి ప్రభుత్వ భూమిని రక్షించాలి
ములుగు టౌన్ నేటి దాత్రి
ములుగు జిల్లా కేంద్రంలో ఈ రోజున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలోని 124/1/ఎ గల ప్రభుత్వ భూమిలో కొంతమంది భూ అక్రమన దారులు 50 ఎకరాలు అక్రమంగా స్వాధీనం చేసుకుని కబ్జా చేసుకోవడం జరిగింది. ఇట్టి భూమిపై తక్షణమే విచారణ జరిపి కాస్తు కబ్జాలో ఉన్న పేదలకు రక్షణ కల్పించాలని కలెక్టర్ గారికి రైతులతో కలిసి వినతిపత్రం కూడా జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు తుమ్మల వెంకటరెడ్డి మాట్లాడుతూ ఈ భూమిపై అనేకమంది పేద ప్రజలు 1966 నుండి కాస్తులో ఉన్నప్పటికీ వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ వారిని భూమ్మీదకి రానివ్వకుండా భూకబ్జాకీ పాల్పడడం జరిగింది. ప్రభుత్వ భూమిని ఇద్దరు వ్యక్తులు 50 ఎకరాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది వీరేగాక ప్రభుత్వ భూమిలో ఆ ప్రాంతంలో అనేకమంది ధనిక రైతులు భూకబ్జా కీ పాల్పడడం జరిగింది .కావున ఇట్టి భూములపై విచారణ జరిపించి ఇట్టి విషయంపై రెవెన్యూ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .లేనియెడల ప్రత్యక్ష పోరాటాలకు దిగి పేద ప్రజలతో భూఆక్రమణ చేస్తామని హెచ్చరించడం జరిగింది .గతంలో ఈ భూమి విషయంలో తగాదా గొడవ అయితే పోలీసు వారు ఎమ్మార్వో ఆఫీస్ లోఇరు పక్షాలను బైండోవర్ చేయగా ఇరుపక్షాలను ఆరు నెలల పాటు భూమి మీదకు వెళ్ళవద్దని వెళ్లిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పగా పేదలూ భూమ్మీదకి వెళ్లలేదు కానీ ధనిక రైతులు మాత్రం దర్జాగా భూమి మీదకు వెళ్లి కాస్తూ చేసుకుంటూ పేదలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇట్టి విషయంపై ధనిక రైతులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా సెక్రటేరియట్ సభ్యుడు పొదిల చిట్టిబాబు మండల కమిటీ సభ్యుడు కన్నోజు సదానందం మరియు రైతులు వెంకటస్వామి, రమేష్ ,నలిని రజిని హరీష్ సుభద్ర అన్నం రెడ్డి పాల్గొనడం జరిగింద
