భ్రూణ హత్యలపై ప్రభుత్వం సీరియస్

హుజురాబాద్ :నేటిధాత్రి
చట్టవిరుద్ధంగా అక్రమ అబార్షన్లు చేసిన మాధవి నర్సింగ్ హోమ్ సీజ్
నర్సింగ్ హోమ్లు నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత
హుజురాబాద్ అక్రమ అబార్షన్లు చేస్తూ సమాజానికి తలవంపులు తెచ్చి న హుజరాబాద్ పట్టణంలోని శ్రీ మాధవి నర్సింగ్ హోమ్ కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి జిల్లా వైద్యా శాఖ అధికారులు సీజ్ చేశారు తెలంగాణలోనే సంచలనం కలిగించిన భ్రూణ హత్యలపై ప్రభుత్వం సీరియస్ కావడంతో హుటాహుటిన జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ సుజాత ఎం సి హెచ్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సనా జువేరియా హుజురాబాద్ డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ బి చందు లు పోలీసుల సహాయంతో పట్టణంలోని శ్రీ మాధవి నర్సింగ్ హోమ్ ను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రి రికార్డులను తనిఖీ చేశారు స్కానింగ్ రూమ్ ల్యాబ్ బెడ్స్ ఇతర గదులను తనిఖీ చేసి నిబంధనల ప్రకారం లేవని గుర్తించారు ఆస్పత్రి ముందు ప్రదర్శించిన డాక్టర్ల పేర్లు ఆసుపత్రికి వచ్చి వైద్యం చేసే డాక్టర్ల పేర్లకు సరిపోవడం లేదని తేలింది రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న డాక్టర్లకు బదులుగా వేరే వారు వస్తున్నారని స్పష్టమైనది బాత్రూంలు రోగులు ఉండే గదులు సక్రమంగా లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఆసుపత్రి నిర్వహణ సక్రమంగా లేకపోవడమే కాకుండా రికార్డును కూడా పూర్తి చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు డి ఆర్ ఏ చట్ట ప్రకారం ఆస్పత్రులు నిర్వహించుకోవాలని అన్నారు నిబంధనలకు విరుద్ధంగా ఏ ప్రైవేటు ఆసుపత్రులు నడుపుతున్నట్లు ఆరోపణలు వస్తే వాటిని సీజ్ చేయడానికి వెనుకాడేది లేదని అన్నారు అక్రమ అబార్షన్ల రాకెట్ లో ముగ్గురు అరెస్టై రిమాండ్ కు వెళ్లారని ఈ ప్రక్రియలో పాల్గొన్న వైద్యురాలు ఎవరు అనేది విచారణ జరుగుతుందని ఆమె తెలిపారు విచారణ అనంతరం సదరు డాక్టర్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు జమ్మికుంట ప్రాంతాలలో ఆసుపత్రుల యజమానులు నిబంధనల ప్రకారం నడపలేకపోతే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె అన్నారు గతంలో జమ్మికుంటలో లింగ నిర్ధారణ చేసి అబార్షన్ చేసిన నర్సింగ్ హోమ్ పై కేసు నమోదు అయిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ రంగారెడ్డి జిల్లా స్పాటిస్టికల్ ఆఫీసర్ కాంతారావు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సాజిద్ హుస్సేన్ డిస్టిక్ హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు
హుజురాబాద్ శ్రీదుర్గ ఆస్పత్రి తనిఖీ
రాబాద్ పట్టణంలోని మాధవి నర్సింగ్ హోమ్ తనిఖీ అనంతరం పక్కనే ఉన్న శ్రీ దుర్గా ఆసుపత్రిని డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ సుజాత డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చందు లు తనిఖీ చేశారు పట్టణంలో వెలసిన సుమారు 50 కి పైగా ప్రైవేటు దావా కాలాలు అన్నిటిని పరిశీలించి అనుమతి లేని వాటికి నోటీసులు జారీ చేసినట్లు డిప్యూటీ డిఎంహెచ్వో తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!