దివంగత ఉర్దూ జర్నలిస్టు కుటుంభానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం

ప్రభుత్వం ద్వారా వచ్చిన లక్ష రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందచేసిన వరంగల్ ఉర్దూ జర్నలిస్ట్ నాయకులు

టియూడబ్లుజేఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టు కమిటీకి కృతజ్ఞతలు తెలిపిన దివంగత జర్నలిస్ట్ యూసుఫ్ షరీఫ్ కుటుంబ సభ్యులు

వరంగల్ తూర్పు, నేటిధాత్రి

వరంగల్ లో గత మూడు దశాబ్దాలుగా ఉర్దూ జర్నలిస్టుగా సేవలందించి ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించిన వరంగల్ చార్ బౌళి ప్రాంతానికి చెందిన సీనియర్ ఉర్దూ జర్నలిస్టు యూసుఫ్ షరీఫ్ కుటుంబ సభ్యులకు, ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం ఒక లక్ష రూపాయలు చెక్ వచ్చే విధంగా సహాయ సహకారాలు అందించిన టియూడబ్లుజేఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టు అధ్యక్షుడు సాజిద్ పాషా, తోటి వరంగల్ ఉర్దూ జర్నలిస్టులకు యూసుఫ్ షరీఫ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఉర్దూ జర్నలిస్టుల అధ్యక్షులు మహమ్మద్ సాజిద్ పాషా మాట్లాడుతూ మృతుడు యూసుఫ్ షరీఫ్ కుటుంబానికి ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక సహాయం లక్ష రూపాయలు రావడానికి సహాయపడిన టియూడబ్లుజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.ఎ మాజిద్, జనరల్ సెక్రెటరీ సయ్యద్ గౌస్ కి, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఐజేయు తెలంగాణ అధ్యక్షులు విరహత్ అలి, వరంగల్ డిపిఆర్ఓ అయూబ్ ఆలి, రాష్ట్ర నాయకులు సీనియర్ జర్నలిస్టు గాడి పెళ్లి మధు, టీయూడబ్ల్యూజేఎఫ్ జిల్లా సెక్రెటరీ ఎంఎ నయీం, కోశాధికారి ఎండి అమీర్ ఖాన్, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, సెక్రెటరీ సదయ్య, కార్యవర్గ సభ్యులు ఎండి నయీం పాష కి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. యూసుఫ్ షరీఫ్ కుటుంబం చాలా పేదరికంగా ఉన్నందువల్ల, యూసుఫ్ షరీఫ్ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉర్దూ జర్నలిస్టుల కమిటీ సహాయ పడుతుందని ప్రభుత్వం నుండి వచ్చే డబల్ బెడ్ రూమ్ లో కూడా మేము మాట్లాడి ఇప్పించేలా పనిచేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షులు మహమ్మద్ సాజిద్ పాషాతో పాటు, కోశాధికారి ఎండి. అమీర్ ఖాన్, సలహాదారులు ఇస్మాయిల్ జబి, ఉపాధ్యక్షులు ఎండి అక్రమ్, ఉపకార్యదర్శి ఎండి రియాజొద్దీన్, ఆర్గనైజర్ సెక్రెటరీ యాహియా జాబ్రీ, కార్యవర్గ సభ్యులు ఎండి బాబర్, ఎండి బషీర్, మహమ్మద్ అజాజ్, సీనియర్ జర్నలిస్టులు అక్తర్ హుస్సేన్, హుస్సేన్ పాషా, ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు మహమ్మద్ నయీం పాషా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!