సిరికొండ శ్రీనివాస్ బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు
చందుర్తి, నేటిధాత్రి:
మండలంలో రైతులకు రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ఆరు గ్యారెంటీ ల పేర్లతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి తెలంగాణ ప్రజలను మోసపూరిత హామీలతో గద్దెనెక్కి విఫలమైంది.సంపూర్ణంగా రైతు రుణమాఫీ చేశామని కాంగ్రెసు నాయకులు చెప్పుకుంటున్న పూర్తిస్థాయిలో అది అమలు కాలేదు.చాలామంది రైతులు రెండు లక్షల రుణమాఫీ అవుతుందని ఆశపడి మిగతా డబ్బులను అప్పులు తెచ్చి బ్యాంకులో జమ చేసిన కూడా ఇప్పటివరకు రుణమాఫీ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రైతులకు రుణమాఫీ చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని ఇది గుర్తించి రైతులను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా రుణమాఫీ చేసి రైతు భరోసా కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది.