# మత్స్యాకారులు లక్షాధికారులు కావాలి
నర్సంపేట,నేటిధాత్రి :
మత్స్యకారుల అభివృద్ధికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నట్లు ప్రకృతి పర్యావరణ సంస్థ సీఈవో మూగ జయశ్రీ తెలిపారు.వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని గిర్నిబావి కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ సీబీబీఓ, పీఎంఎమ్మెస్ వై & ఎస్ఎఫ్ఏసీ) సహకారంతో ప్రకృతి పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో ప్రాథమిక మత్స్య సహాకర సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార సంఘాల పాలకవర్గ సభ్యులకు సంఘం పనితీరు వాటి నిర్వహణపై అవగాహన కల్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ మత్స్యకారుల ఆర్థికాభివృద్ది సాధించేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ సహకారంతో ఏర్పాటైన మత్స్యకార కార్మిక సంఘాలను బలోపేతం చేయాలన్నారు. వీటి ద్వారా దళారీ వ్యవస్థను నియంత్రించవచ్చని తెలిపారు.ప్రభుత్వ రాయితీలు, వ్యవసాయ, చేపల ఉత్పత్తులకై మార్కెటింగ్ సౌకర్యం,నాణ్యమైన విత్తనాలు ఎరువుల, చేపల నిల్వలకు ప్రత్యేక శీలీకరణ కేంద్రాలు వంటి సదుపాయాలు కల్పించబడతాయని వివరించారు. సంఘాల్లో ప్రతీ మత్స్యకారుడు లాభాలు అర్జించి, ఆ కుటుంబాలు ఆర్థికాభివృద్ధి చెందాలన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ మత్స్యకార సంఘాల ప్రాజెక్ట్ ఇంచార్జ్ పి. వినోద్ కుమార్ పెరుక, 10 గ్రామాల మత్స్యకార (ముదిరాజ్) సంఘ డైరెక్టర్లు పాల్గొన్నారు.