ప్రభుత్వ డిగ్రీ కళాశాల మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల.

# పలితాలు విడుదల చేసిన కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డి.

నర్సంపేట,నేటిధాత్రి :

నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) 2024 జనవరి నెలలో నిర్వహించిన బిఏ, బికామ్, బిఎస్,సి (లైఫ్ సైన్సెస్) మరియు బిఎస్సి (ఫిజికల్ సైన్సెస్) మొదటి సెమిస్టర్ ఫలితాలు కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డి విడుదల చేసారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లం నవీన్ ను కళాశాల అటానమస్ హోదా పొంది పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించినందుకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డి అభినందించారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లం నవీన్ ఫలితాల వివరాలు తెలిపారు.
బిఎస్సి (ఫిజికల్ సైన్సెస్) లో 81శాతం,బిఎస్సి (లైఫ్ సైన్సెస్) లో 79 శాతం,బి.ఏ లో 50 శాతం,బికామ్ లో 52 శాతం,ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లం నవీన్ తెలంగాణ రాష్ట్ర విద్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ మరియు కళాశాల విద్య కమీషనర్ బుర్ర వెంకటేశం, ఐఏఎస్,జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేందర్ సింగ్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జి.యాదగిరి,అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ డాక్టర్ పి.బాల భాస్కర్ తో పాటు కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.మల్లా రెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ నర్సింహాచారీ, అదనపు పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ తిరుమలదేవిలు అందించిన సహాయ సహకారాలు ధన్యవాదాలు తెలిపారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో రిజిస్ట్రార్ మల్లారెడ్డి, ప్రొఫెసర్ నర్సింహాచారీ, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లం నవీన్ తో పాటు కళాశాల ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ ఎ .శ్రీనాథ్, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఐ.శివనాగశ్రీను, తోట రమేష్, డాక్టర్ బి. విష్ణు కుమార్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!