
Government Degree 2nd and 4th semester results released
ప్రభుత్వ డిగ్రీ 2,4 వ సెమిస్టర్ ఫలితాల విడుదల
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) నర్సంపేట లో మే 2025 నెలలో నిర్వహించిన బిఏ,బికామ్,బిఎస్సి (లైఫ్ సైన్సెస్),బిఎస్సి (ఫిజికల్ సైన్సెస్) రెండవ, నాల్గవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామ్ చంద్రం, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రొఫెసర్ కట్ల రాజేందర్ విడుదల చేశారు.
ఈ సందర్బంగా నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ మాట్లాడుతూ కళాశాల అటానమస్ సెమిస్టర్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించినందుకు కాకతీయ విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే.ప్రతాప్ రెడ్డి అభినందించారని అన్నారు.అనంతరం ప్రిన్సిపాల్ ఫలితాల వివరాలు తెలిపారు.బిఎస్సిలో 41.74 శాతం,
బి.ఏ లో 51.85 శాతం,బి.కామ్ లో 39.02 శాతం పాస్ కాగా మొత్తం 42.62 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.ఈ ఫలితాలు క్యూ.ఆర్ కోడ్ తో పాటు లింక్ ద్వారా అందుబాటులో కళాశాల వెబ్సైట్ లో ఉంటాయని తెలిపారు.ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్, కళాశాల విద్య కమీషనర్ ఎ.శ్రీదేవసేన, జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేందర్ సింగ్, జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బాల భాస్కర్ ధన్యవాదాలు తెలిపారు.
ఫలితాల విడుదల ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి శ్రీ ఎస్. కమలాకర్,అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ రాజీరు,
డాక్టర్ భద్రు, స్టాఫ్ సెక్రటరీ రహీముద్దీన్ పాల్గొన్నారు.