`రాష్ట్ర బడ్జెట్ బ్రహ్మాండం… అన్ని వర్గాలకు ప్రయోజనం.
`భట్టి పద్దు…బహు విధాల పసందు!
`పద్దు బహు ప్రయోజనం… లెక్కలు అయోమయం!
`నిధుల కేటాయింపులు బేష్
`వాటి పంపకాలపై వివణలు అసంపూర్ణం.
`బిఆర్‌ఎస్ అభ్యంతరాలు సాహేతుకం.
`బిజేపి అనుమానాలు వాస్తవం.
`ప్రభుత్వం మెరుగైన ఆలోచనలు.
`ఆచరణ బలంగా సాగితే ఎంతో ప్రయోజనం.
`ఆదాయం ఎలా సమకూర్చుతారన్నదే పెద్ద అనుమానం.
`ఆరు గ్యారెంటీలకు నిధులు సరిపోతాయా అన్నదే సంశయం.
`మొత్తానికి తెలంగాణ పద్దు సంపూర్ణం.
`అన్ని వర్గాల ప్రయోజనం జరిగితే అభివృద్ధికి కొత్త బాష్యం.
`కేటాయింపులు ఘనం..
`అమలు జరిగితే తెలంగాణ ప్రగతి పరుగులు ఖాయం.
హైదరాబాద్,నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తి స్దాయి 2024`25 తెలంగాణ ప్రగతికి ప్రతీకగా వుంది. అభివృద్దికి దిక్సూచీ కానున్నది. ప్రతిపక్షాల విమర్శలు ఎలా వున్నా, తెలంగాణ అభివృద్దిని పరుగలు పెట్టించే విధంగా రూపకల్పన జరిగింది. అందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు. కారణం ప్రాధాన్యతా అంశాలను ఎంపిక చేసుకున్న విధానం గొప్పగా వుంది. బిఆర్‌ఎస్ లేవనెత్తిన అంశాలను కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకోలేదన్న విమర్శలు సాహేతుకం కాదు. కాకపోతే గతం నుంచి అమలులో వున్న అంశాలకు ప్రస్తావన లేదనడంలో తప్పులేదు. ఇక రాష్ట్ర బెడ్జెట్ విషయంలో బిజేపి పెద్దగా లేవనెత్తిన అంశాలు లేకపోయినా, పెదవి విరుపులున్నాయి. విమర్శలు కూడా సాహేతుకంగానే వున్నాయి. అయినా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హమీల మేరకు బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది. అంతే కాని ప్రతిపక్షాల ఇష్టం మేరకు బడ్జెట్ రూపకల్పన ఎక్కడా జరగదు. ఎప్పుడూ జరగలేదు. ఆనవాయితీగా ప్రతిపక్షాలు ఆ మాత్రం ఆరోపణలు గుప్పించకపోతే మీడియాలో స్ధానం వుండదు. బడ్జెల్‌లో తప్పులు వెక్కపోతే ప్రతిపక్షం అన్న మాటకు అర్ధం లేదు. అందుకే వారి వారి అభిప్రాయలను వెలుబుచ్చడం అన్నది ఒక రివాజు మాత్రమే. రాష్ట్ర ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన పద్దులోని ప్రధానాంశాలు మాత్రం చాలా ఆశాజనకంగానే వున్నాయి. ఎక్కడా నేల విడిచి సాము చేసినట్లు కనిపించలేదు. ఏ వర్గం నుంచి కూడా విరుపులు రాకుండా సమతూకంలో పద్దుల పంపకం జరిగిందనే చెప్పాలి. మొత్తం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూ.2,91,159 కోట్లు. అందులో ప్రధానంగా వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశారు. ఎందుకంటే తెలంగాణ అంటే ఒకప్పుడు ఎడారి. ఇప్పుడు మాగాణ. రైతు మేలు కోసం, సంక్షేమంకోసం, సాగుకు సాయంకోసం, సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచడం కోసం, పాడి కోసం, పంట కోసం, రైతుకు భరోసా కల్పించడం కోసం కేటాయింపులు అందరిచేత ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా రైతులు సంతోషంగా వున్నారు. పైగా ఇటీవల చేసిన రైతు రుణమాఫీ అన్నది గొప్ప కార్యక్రమం. గతంలో అటు కేంద్ర ప్రభుత్వం కాని, ఏ రాష్ట్రంలో కాని ఏక కాలంలో రైతులకు 2లక్షల రుణమాఫీ చేపట్టడం అన్నది గొప్ప విషయం. అనేక రాష్ట్రాలు రైతు రుణమాఫీ చేపట్టాయి. కాని తెలంగాణ ప్రభుత్వం చేసిన విధంగా ఏక కాలంలో రైతు రుణమాఫీ అన్నది గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇది చారిత్రాత్మకమనే చెప్పాలి. వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో ఈ ఏడాది రైతు రుణమాఫీకోసమే పెద్ద ఎత్తున నిధులు వినియోగించాల్సి వస్తుంది. అంటే తెలంగాణ రైతులంతా ఏక కాలంలో రుణ విముక్తి పొండదం అన్నది రైతుల్లో ఏక కాలంలో సంతోషాన్ని, ఆనందాన్ని నింపడమే అవుతుంది. ఇక్కడ రైతు రుణమాఫీ విషయంలో కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఎన్నో ఏళ్లుగా తెలంగాణ రైతు ఎదురుచూస్తున్న కల నెరవేరింది. తెలంగాణ రైతు బ్యాంకు రుణం తీరింది. రైతకు కొండంత బరువు దిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత నిజమైన పండుగ రైతుకు రుణవిముక్తి పండుగొచ్చింది. రైతు గుండెల మీద గుడిబండగా వున్న రుణం తీరడంతో రైతు కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. అయితే ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు అక్కడక్కడ కొన్ని బాలారిష్టాలు వుంటాయి. అదే ఏడు నెలల కాలం ఎదరుచూపుకు కారణమైంది. కాకపోతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్టుదల మందు సవాళ్లు తలవంచాయి.
రైతు రుణమాపీ జరిగిన రోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఇంత కంటే గొప్ప తరుణం మరొకటి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి గెలిపించిన రైతులను రుణ విముక్తి చేయడంలో ఎంత సంతోషాన్నిచ్చిందన్నారు. అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా తర్వలో పూర్తి చేస్తామన్న భరోసాని ప్రజలకు కల్పించారు. రైతు రుణమాఫీ జరిగింది. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏక కాలంలో రుణమాఫీ రూ. 2లక్షల వరకు పూర్తి చేస్తామని రైతులకు మాట ఇచ్చారు. అయితే ఏక కాలంలో ప్రభుత్వం రుణమాఫీ మాట తప్పిందన్న అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఇంకా రైతులను తప్పుదోవ పట్టించే కుట్రలు ఇంకా చేస్తూనే వున్నారు. నిజానికి పదేళ్లలో కేసిఆర్‌కు సాద్యం కాని రుణమాఫీ ఎలా రేవంత్‌రెడ్డికి ఎలా సాధ్యమైందన్న దానిని గురించి లోతైన విశ్లేషణలు చేయకుంగా, రుణమాఫీ మీద బిఆర్‌ఎస్ కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తోంది. దాంతో బిఆర్‌ఎస్ మరింత ప్రజల్లో పలుచనౌతోంది. ఎందుకంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏక కాలంలో రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. అది కూడా రెండు లక్షల వరకు చేస్తామని కూడా హమీ ఇచ్చింది. అది అక్షరాల రుజువైంది. వ్యవసాయ రంగానికి చేసిన కేటాయింపుల్లో రూ.31వేల కోట్లు రైతు రుణమాఫీకి పోతే, మిగత కేటాయింపులు ఈ ఏడాది నుంచి రైతుకు ప్రతి ఏటా రూ.15వేలు ఇస్తామని చెప్పారు. అంతే కాకుండా ఎన్నికల సమయంలో కౌలు రైతులకు కూడా రూ.12వేలు ఇవ్వనున్నారు. ఇక రైతు భీమా వంటి వాటికి ఖర్చు చేయనున్నారు. దానికి తోడు ఈసారి సాగు నీటి రంగానికి కూడా పెద్దఎత్తున నిధులు కేటాయించారు. అయితే వాటిపై సమగ్ర సమాచారం ఇవ్వలేదు. కాని కేటాయింపులు మాత్రం దండిగానే చేశారు. ఇక మిగతా రంగాల విషయానికి వస్తే ఉద్యానవన శాఖకు రూ.737 కోట్లు కేటాయింపులు చేశారు. ఇక పశుసంవర్ధకశాఖకు రూ.1980 కోట్లు కేటాయించారు. అయినా ప్రతిపక్షాలు పెదవి విరవడంలో అర్దం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన బర్రెలు, గర్రెల స్కీమ్‌లలో జరిగిన అవినీతి బైట పడిరది. ఆనాడు ప్రత్యేకంగా వందల కోట్లు కేటాయించి గొప్పలు చెప్పుకున్నారు. కాని కాంగ్రెస్ ఫ్రభుత్వం పశుసంవర్ధక శాఖకు రూ.1980 కోట్లు కేటాయించి పాడి. పంటల మీద ప్రభుత్వానికి వున్న శద్ర తెలియజేసింది. ఈ నిధులతో రైతులకే కాకుండా యాదవ సోదరులకు గొర్రెల పంపిణీ, రైతులకు బర్రెలు పథకం అమలు చేయడం వీలౌతుంది. ఇక గృహజ్యోతి వంటి పధకానికి రూ.2418 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఇదిలా వుంటే గృహజ్యోతిలోనే భాగమైన గ్యాస్ సిండర్లకు కూడా ప్రత్యేకంగా నిధుల కేటాయింపు అన్నది కొసమెరుపు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు పెరిగిన గ్యాస్ ధరలతో ఇబ్బందులు పుడుతున్నారు. అందుకే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హమీ మేరకు రూ.500కే సిలిండర్ ఇస్తామని పేర్కొన్నారు. అందుకే పెద్దఎత్తున నిధులు కేటాయించారు.
ఈ బడ్జెట్‌లో పంచాయితీ రాజ్‌కు పెద్ద పీట వేశారనే చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలను గ్రామ జ్యోతి ద్వారా అభివృద్ది చేసిందని గొప్పలు చెప్పుకున్నా, పంచాయితీలలో పారిశుద్యం కూడా పడకేసింది. గ్రామీణ వ్యవస్ధ అస్తవ్యస్తమైంది. ఒక దశలో సర్పంచ్‌లు కూడా ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు చూశాం. ఈసారి గ్రామీణ వ్యవస్ధ బలోపేతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పల్లెలను ప్రగతి పథం వైపు నడిపించేందుకు నిధులు గొప్పగా కేటాంపులు చేశారు.. దాంతో గ్రామీణ ఆర్ధిక వ్యవస్ద బలోపేతం కావడమే కాదు, పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు అని చేసి చూపించడానికి కూడా వీలౌతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ బడ్జెట్‌లో దళితుల సంక్షేమం కోసం చేసిన కేటాయింపులో ఆయా వర్గాల అభివృద్దికి బాటలు వేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఎస్సీ సంక్షేమం కోసం రూ.33124 కోట్లు కేటాయింపులు చేయడం అన్నది గొప్ప విషయం. అయితే ఇక్కడ బిఆర్‌ఎస్ చేసిన ఆరోపణల్లో నిజంలేదు. దళిత బంధు ప్రస్తావన లేదని అన్నారు. కాని దళితుల అభివృద్ది కోసం ఇంత పెద్ద ఎత్తున నిధుల కేటాయింపులు అన్నవి దళిత సమాజాన్ని ఆర్ధికపురోగతి వైపు నడిపించడానికి దోహదం చేస్తుంది. ఎస్టీల సంక్షేమం కోసం కూడా రూ.17056 కోట్లు కేటాయించారు. దాంతో గిరిపుత్రల జీవన ప్రమాణాలను పెంచడంలో సత్పలితాలు అందుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మైనార్టీ సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు, అడవులు, పర్యావరణ పరిరక్షణకు కూడా పెద్దఎత్తున నిధులు కేటాయించారు. విద్యా రంగానికి గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.21292 ఓట్లు కేటాయింపులతో తెలంగాణలో విద్యా విప్లవం తీసుకురావచ్చని చెప్పడంలో అతిశయోక్తి లేదు.