క్రీస్తు సువార్త శాంతి ర్యాలీ.
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమను పంచాలి
కేసముద్రం/ నేటి ధాత్రి
గురువారం కేసముద్రం మున్సిపల్ పట్టణ కేంద్రంలో గుడ్ ఫ్రైడే పండుగను పురస్కరించుకొని కేసముద్రం మరియు ఆయా ప్రాంతాల నుండి క్రైస్తవులు అంతా కలిసి శాంతి ర్యాలీ ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, జెండా ఊపి ప్రారంభించారు. యేసే నిజమైన రక్షకుడు ఆయన మానవుల రక్షణ కొరకు నరావతారం ఎత్తి మనకోసం తన ప్రాణాన్ని పెట్టాడని కొనియాడారు. అదేవిధంగా దైవ సేవకులు కె ఎం పి ఎఫ్ మండల అధ్యక్షులు మునిగె జోసెఫ్ సురేష్ మాట్లాడుతూ సర్వ మానవాళికి యేసే నిజమైన రక్షకుడని అని కొనియాడుతూ , నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిచాలనే మాటను గుర్తు చేస్తూ అలా జీవించాలి అని సూచించారు.అలాగే కె ఎం సి వై ఎఫ్ అధ్యక్షులు వెంకట్ కన్న మాట్లాడుతూ కేసముద్రం ప్రజల కోసం ప్రార్థనలు చేసి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో దైవసేవకులు మల్లెపాక తిమోతి, పిల్లి కుమార స్వామి, ఆశీర్వాదం, ప్రభుజీవన్, థామస్ రెడ్డి, రూబెన్ పాల్, మహేందర్, సుధాకర్, ఫిలిప్, పేతురు, ఇశ్రాయేలు, కశ్మీనాధ్, రవి కుమార్, జాన్ వెస్లీ, జాన్ మెహబూబ్, శ్రీధర్, పీటర్ సింగ్, లాజరస్ గౌడ్, కర్నాకర్, విల్సన్, పృథ్విరాజ్, బనిషెట్టి వెంకటేష్ మరియు ఎం సి వై ఎఫ్ నాయకులు జన్ను మహేందర్, తిప్పర్తి శ్రీధర్, కర్నాకర్ యువకులు, విశ్వాసులు క్రైస్తవులు అంతా పాల్గొన్నారు.