Gorantla Kumaraswamy Elected Ainavolu Padmashali Mandal President
అయినవోలు పద్మశాలి సంఘం మండలాధ్యక్షులుగా గోరంట్ల కుమారస్వామి
పాలకుర్తి , నేటిధాత్రి :
అఖిల భారత పద్మశాలి అనుబంధం తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అయినవోలు మండల అధ్యక్షులుగా గోరంట్ల కుమారస్వామి ఏకగ్రీవంగా ఎన్నికై సూరత్ కు వచ్చిన సందర్భంగా సోమేశ్వర టెక్స్టైల్ అండ్ మ్యానుఫ్యాక్చరర్ వీవర్స్ అసోసియేషన్ వారు గోరంట్ల కుమారస్వామికి శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు. సోమేశ్వర అసోసియేషన్ ఉపాధ్యక్షులు కైరం కొండ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి వన్నాల ప్రకాష్, కోశాధికారి జిగిజర్ల రమేష్, కమిటీ సభ్యులు సామల శ్రీనివాస్, కోట అంబదాసు, వెంగల్ దాస్ రవి, కుసుమ అశోక్, సభ్యులు బొప్పరాతి రమేష్, కైరం కొండ సురేందర్, పాము శీను, వెన్నం అనిల్, సామల సుధాకర్, పొన్నాల సోమయ్య, పొట్ట బత్తిని శ్రీనివాస్, చిలుకుమారి సాయిప్రసాద్, వేముల వినయ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు
