Gopati Kamala Likely in Kyathanpally Ward 9 Race
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ తొమ్మిదో వార్డ్ బరిలో గోపతి..?
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ తొమ్మిదో వార్డ్ బరిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ వార్డ్ మెంబర్ గోపతి భానేష్ భార్య గోపతి కమల బరిలో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. తొమ్మిదో వార్డ్ కు జనరల్ మహిళ రిజర్వేషన్ ప్రకటనతో బరిలో నిలుస్తారని తెలుస్తోంది. గోపతి భానేష్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కి అత్యంత సన్నిహితుడు కావడం,కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందిస్తుండడం తో మంత్రి ఆశీస్సులు ఉన్న నేపథ్యంలో గోపతి కమలకే టికెట్ ఇచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.

కొత్త, పాత తిమ్మాపూర్, అమ్మ గార్డెన్ ఏరియాలలో గోపతి భానేష్ కు ప్రజా ఆదరణ ఉన్న నేపథ్యంలో టికెట్ వరించి గెలిస్తే చైర్పర్సన్ రేసులో సైతం నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పలు వార్డులలో రిజర్వేషన్లు మార్పులు చేర్పులు చేసింది .గతంలో చైర్ పర్సన్ గా ఎస్సీ మహిళ రిజర్వేషన్ ఉండగా ప్రస్తుతం జనరల్ మహిళ గా ఖరారయింది. కాంగ్రెస్ పార్టీలో చైర్ పర్సన్ రేసులో బడా నేతలు ఉన్నట్లు సమాచారం. ఏదేమైనా రానున్న రోజుల్లో మునిసిపాలిటీలో పోరు రసవత్తరంగా ఉండబోతోంది.
