Google Partners with ICC to Transform Live Cricket Experience
ఐసీసీతో గూగుల్ ఒప్పందం
ప్రత్యక్ష మ్యాచుల విశ్లేషణను మరింత లోతుగా, ఆసక్తికరంగా మార్చేందుకు గూగుల్.. ఐసీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రత్యక్ష మ్యాచుల వీడియో, ఆడియో వ్యాఖ్యానాన్ని అడ్వాన్స్డ్ ఏఐ జెమిని 3 ప్రో విశ్లేషించనుంది. దీంతో అభిమానులు క్రికెట్‌ను మరింత ఆస్వాదించేందుకు వీలుపడనుంది.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్లో ప్రత్యక్ష మ్యాచుల విశ్లేషణను మరింత లోతుగా, ఆసక్తికరంగా మార్చేందుకు గూగుల్.. ఐసీసీ(ICC)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రత్యక్ష మ్యాచుల వీడియో, ఆడియో వ్యాఖ్యానాన్ని అడ్వాన్స్డ్ ఏఐ జెమిని 3 ప్రో విశ్లేషించనుంది. దీంతో అభిమానులు మ్యాచులను మరింత ఆస్వాదించేందుకు వీలుపడనుంది. ఈ మేరకు గూగుల్(Google) సీఈవో సుందర్ పిచాయ్ ఈ విషయం గురించి ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ఇప్పుడు గూగుల్.. మీ గూగ్లీకి సహాయం చేస్తుంది’ అని పేర్కొన్నారు.
ఏఐ జెమిని 3 ప్రో లైవ్ మ్యాచును గమనించి, కామెంటరీని విని, ఏం జరిగిందనేది సరళమైన భాషలో ఫ్యాన్స్‌కు వివరిస్తుంది. మ్యాచు హైలైట్స్, ఆటగాళ్లు, ఆటకు సంబంధించి ఇతర ఆసక్తికర విషయాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచనుంది. ఈ అధునాతన సాంకేతికతను వాడి మహిళల క్రికెట్‌ను మరింతగా అభిమానులకు చేరువ చేయడం కూడా ఈ భాగస్వామ్యం ఉద్దేశం.
