Lose Weight, Win Bonus — China’s Unique Company Challenge
భలే ఆఫర్.. బరువు తగ్గండి… బోనస్ పట్టండి’ అంటూ..
ఉద్యోగి మెరుగైన పనితీరు కనబరిస్తే బోనస్ ఇవ్వడం సహజం. కానీ చైనాకు చెందిన ఓ కంపెనీ మాత్రం ‘బరువు తగ్గండి… బోనస్ పట్టండి’ అంటూ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
చైనాలోని ‘ఇన్‌స్టా 360’ అనే టెక్ కంపెనీ వెరైటీ వెయిట్‌లాస్ ఛాలెంజ్‌ను విసిరింది. ఇందులో భాగంగా సెషన్‌కు 30 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు. అది కూడా ఊబకాయంతో ఉన్నవారికే తొలి ప్రాధాన్యత. ప్రతీ బృందంలో సభ్యులు వారానికి ఎంత బరువు తగ్గారో పరిశీలించి నమోదు చేసుకుంటారు. ఈ ఛాలెంజ్‌లో ఒక వ్యక్తి తగ్గే ప్రతీ అరకిలోకు సుమారు రూ. 6200 బోనస్‌గా ఇస్తారు. అయితే ఇక్కడో మెలిక ఉందండోయ్… ఎవరైనా మళ్లీ బరువు పెరిగారే అనుకోండి… ప్రతీ అర కిలోకు రూ. 9900 జరిమానా కట్టాల్సి ఉంటుంది.ఈమధ్యనే షీయాకీ అనే ఉద్యోగి 90 రోజుల్లో 20 కిలోలు తగ్గి సుమారు రూ. 2.5 లక్షలు గెల్చుకుంది. ఆమెకు ‘వెయిట్‌లాస్ ఛాంపియన్’ టైటిల్ కూడా అందజేశారు. ‘ఈ ఛాలెంజ్ ద్వారా ఉద్యోగులు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చేలా చేయడం… జీవితంలోనూ ఉత్సాహంగా ముందుకు సాగేలా ప్రోత్సహించడమే తమ లక్ష్యమ’ని సంస్థ చెబుతోంది. ఈ వెయిట్‌లాస్ ప్రోగ్రామ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
