Government to Launch Taxi App to Rival Ola and Uber
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఓలా ఉబర్‌కు పోటీగా ‘ట్యాక్సీ యాప్’ సేవలకు కేంద్రం సన్నద్ధం..
ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉబర్, ఓలా క్యాబ్ సర్వీస్‌లకు ధీటుగా.. మరిన్ని వివరాల కోసం ఈ కథనం చదవండి.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌలభ్యం కోసం.. కొత్తగా ట్యాక్సీ యాప్(Taxi Application)ను తీసుకొచ్చింది. 2026 జనవరి 1 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం.. ప్రైవేట్ సంస్థలైన ఉబర్(Ubar), ఓలా(Ola) క్యాబ్‌లు అందిస్తున్న సేవలకు ధీటుగా ఈ యాప్‌ను నిర్వహించనుంది.ఈ యాప్‌లో సేవలందించేందుకు ఇప్పటికే సుమారు 56 వేల మంది డ్రైవర్లు రిజిస్ట్రేషన్(Driver Registration) చేసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. దీంతో ఇదివరకు ఉన్న క్యాబ్ ఛార్జీల(Cab Charges) నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా.. ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండానే ఈ సేవలను పొందే అవకాశముంది. అయితే.. తొలుత పైలట్ ప్రాజెక్ట్ కింద ఢిల్లీ(Delhi)లో ఈ యాప్ సేవలను అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది కేంద్రం. ఆ తర్వాత దేశంలోని మిగిలిన ప్రాంతాలకూ విస్తరిస్తామని తెలిపింది.
