
"RTC Lucky Draw for Passengers"
ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గుడ్ న్యూస్
ఆర్టీసీ బస్సులో ప్రయాణించి..బహుమతులు పొందండి
నర్సంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ
నర్సంపేట,నేటిధాత్రి:
ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఒక గుడ్ న్యూస్ ప్రకటించింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి.. బహుమతి గెలుపొందండి అంటూ ప్రచారం మొదలుపెట్టారు. కాగా నర్సంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ ఇందుకుగాను ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రయాణికుల కోసం ప్రత్యేక బంపర్ లక్కీడ్రా స్కీం నిర్వహిస్తోందని చెప్పారు.ఈనెల 27 నుంచి అక్టోబర్ 6 వరకు ఆర్టీసీ సెమీడీలక్స్, డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ, లహరి, అన్ని ఏసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణి కులు తమ టికెట్ పైన పేరు,ఫోన్ నెంబర్, చిరునామా రాసి నర్సంపేట బస్టాండ్ లో ఏర్పాటు చేసిన బాక్స్ లో వేయాలన్నారు.అక్టోబర్ 8వ తేదిన ప్రాంతీయ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారుల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ముగ్గురు విజేతలను ఎంపిక చేసి నగదు బహుమతులు అందజేస్తారు. మొదటి బహుమతి రూ.25వేలు, రెండో బహుమతి రూ. 15వేలు, మూడో బహుమతి రూ.10 వేలు నగదు రూపంలో అందిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ఆర్టీసీ ప్రయాణి కులు సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ సూచించారు.