Gold Prices Drop by ₹2,000!
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..
బంగారం ధర ఇవాళ(గురువారం) భారీగా పడిపోయింది. దాదాపు రూ.2 వేలు తగ్గింది.
ఇంటర్నెట్ డెస్క్: బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దీపావళి సమయంలో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధర, ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, పసిడి పెట్టుబడుల్లో లాభాల స్వీకరణ వంటి కారణాల వల్ల పసిడితో పాటు వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. గత రెండు వారాల్లో పసిడి ధర భారీగా తగ్గింది. ఈ క్రమంలో బంగారం ధర ఇవాళ(గురువారం) కూడా భారీగా పడిపోయింది. దాదాపు రూ.2 వేలు తగ్గింది. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర తగ్గడంతో దేశీయంగా బంగారం ధరలు పతనమవుతున్నాయి. భారత్లో నిన్న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.1,22,400 ఉంది. ఇవాళ రూ.1,910 మేర తగ్గి రూ.1,20,490 చేరింది. దీంతో పసిడి ప్రియులు కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు.
