
నల్లబెల్లి, నేటి ధాత్రి:
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశానుసారం మండల మహిళా విభాగం అధ్యక్షురాలుగా నాగరాజు పల్లి సర్పంచ్ గోనె శ్రీదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు భానోత్ సారంగపాణి వెల్లడించారు అనంతరం శ్రీదేవి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఎమ్మెల్యే పెద్ది పెద్ద బాధ్యత అప్పగించారని తన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే సార్వత్వి ఎన్నికల్లో మండలంలోని మహిళ లోకాన్ని ఏకం చేసి పెద్ది సుదర్శన్ రెడ్డి గెలుపు కొరకై కృషి చేస్తానని అలాగే తన ఎన్నికకు సహకరించిన మండల బాధ్యులైన సారంగపాణి, ఊడుగుల ప్రవీణ్ గౌడ్, చెట్టుపల్లిమురళీధర్, కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, పాలెపురాజేశ్వరరావు,గందె శ్రీనివాస్ గుప్తకు కృతజ్ఞతలు తెలియజేశారు