జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లో ఆదివాసి నాయకపోడు కులస్తులు కొమరం భీమ్ జయంతి సందర్భంగా జైపూర్ అంగన్వాడి కేంద్రంలో ఘనంగా పిల్లలతో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అంగన్వాడి పిల్లలకు పలకలు, స్వీట్స్ అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జుల్,జుంగల్ జమీన్ నినాదంతో నిజం సర్కార్ పై భయంకరంగా పోరాడిన గోండు బొబ్బిలి కొమురం భీం ఆదివాసీలను పీడిస్తున్న నిజాం సర్కార్ కు ఎదుర్కొని నిలబడ్డాడు.గెరిల్లా తరహా పోరాటాలకు ఆదివాసులను సిద్ధం చేసి నిజాం కు కంటిమీద కునుకు లేకుండా చేసిన గొప్ప పోరాట వీరుడు ఆదివాసీలను ఏకం చేసి హక్కుల కోసం పోరాటం చేసిన మహా నాయకుడు నేటికీ కొమరం భీమ్ ఉద్యమ స్ఫూర్తితో ఆదివాసీలు తమ హక్కుల సాధనకై పోరాటాలు కొనసాగిస్తున్నారు.అయితే సైన్యం తూటాలకు భీమ్ నేలకొరిగాడు.కానీ ఆయన రగిలించిన పోరాటం ప్రభుత్వంలో కదలిక తెచ్చింది. అడవి బిడ్డలకు ప్రత్యేక హక్కులు కల్పించింది అని అన్నారు.