
గొల్లపల్లి, నేటి ధాత్రి:
జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు జిల్లాలో గంజాయి నిర్మూలనకు జగిత్యాల డి.ఎస్.పి రఘు చందర్ ఆధ్వర్యంలో ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి, గొల్లపల్లి ఎస్సై సతీష్ మరియు వారి సిబ్బందితో చిల్వాకోడూరు ఎక్స్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సాయంత్రం 6 గంటలకు ఒడిస్సా రాష్ట్రం నుండి అబ్బాపూర్ కు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసు వారిని చూసి కంగారు పడుతూ పారిపోయే ప్రయత్నం చేస్తుండగా వెంటనే పోలీసు వారు సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది.
వివరాల్లోకి వెళితే….
గత రెండు సంవత్సరాల నుండి నిందితులు మారంపల్లి లక్ష్మణ్( 20) గ్రామం బాల పల్లి, జగిత్యాల రూరల్ మండలం మరియు దొమ్మటి కార్తీక్( 21) గ్రామం అబ్బాపూర్, గొల్లపల్లి మండలం గంజాయి తాగుటకు బానిస ఆయి, అది తాగకుంటే వారికి అంత పిచ్చి లేసినట్టు అవుతుంది మరియు వారి ఖర్చులకు డబ్బులు లేకపోవడం వలన గంజాయి ఎక్కడైనా తక్కువ ధరకు కొని ఇక్కడకు తీసుకువచ్చి తాగే అంత తాగి మిగిలిన గంజాయి ఎక్కువ ధరకు అమ్మితే డబ్బులు ఎక్కువ వస్తాయని దానితోటి వారి ఖర్చులు ఎల్లా తీసుకుంటూ జల్సాలు చేయవచ్చు అని నిందితులు నిర్ణయించుకున్నారు. గంజాయి ఎక్కడ దొరుకుతుందని తెలుసుకోగా వారి స్నేహితుడు పెగడపల్లి కి చెందిన అజయ్ ఒడిస్సా రాష్ట్రంలో నూకరాజు అనే వ్యక్తి వద్ద గంజాయి తక్కువ ధరకు దొరుకుతుందని, అతని వద్ద గంజాయి తీసుకొని వస్తే మనం ముగ్గురం తాగే అంతా తాగి మిగిలింది ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముకుందామని అజయ్ చెప్పి నూకరాజు యొక్క అడ్రస్ ఇవ్వగా నిందితులు ఈనెల 14న టూవీలర్ పల్సర్ బైక్ .(TS11ES8312) పై బయలుదేరి ఈనెల 15వ తేదీన ఒడిస్సాలో నూకరాజును కలువగ13.24 kgs గంజాయి మరియు చరాస్ 40 గ్రామ్స్ తెచ్చి వారికి ఇచ్చినాడు ఇందుకుగాను వారు నూకరాజుకు 15 వేల రూపాయలు మరియు ఒక నల్లని మొబైల్ ఫోన్ ఇచ్చినారు అట్టి గంజాయిని బ్యాగులో వేసుకుని ఆరోజు రాత్రి అక్కడ పడుకొని 2024- 2-16 తేదీన ఉదయం బైక్ మీద భద్రాచలం కరీంనగర్ మీదుగా అబ్బ పూర్ కి వస్తుండగా సాయంత్రం 6 గంటలకు చిల్వాకోడూర్ ఎక్స్ రోడ్డు వద్ద కు రాగానే ధర్మపురి సిఐ రామ్ నర్సింహారెడ్డి, గొల్లపల్లి ఎస్సై సిహెచ్ సతీష్ సిబ్బంది జె. వేణు, ఎండి హలీం, సిహెచ్ లక్ష్మణ్, హోంగార్డు శ్రీనివాస్ నిందితులను పట్టుకొని పంచుల సమక్షంలో నిందితుల వద్ద నుండి 13.24 kgs గంజాయి, 40 గ్రామ్స్ చరాస్ రెండు సెల్ ఫోన్లు మరియు ఒక పల్సర్ బైక్ ని స్వాధీన పరచుకున్నారు. స్వాధీన పరుచుకున్న గంజాయి మరియు చరాస్ B’day రూ.2,65,640 ఉంటుందని ఎస్సై తెలిపారు. ప్రభుత్వ నిషేధిత గంజాయినివారు స్వాధీన పరచుకొని నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపిన పోలీస్ అధికారులు.
నిందితులను పట్టుకొని13.282 kgs గంజాయి ని సీజ్ చేయడంలో చకాచక్యంగా వ్యవహరించిన డి.ఎస్.పి .డి. రఘు చందర్, టీఎస్ నాబ్ జిల్లా నోడల్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్, ధర్మపురి సీఐ రామ్ నరసింహారెడ్డి, గొల్లపల్లి ఎస్సైసిహెచ్ .సతీష్ సిబ్బంది జే. వేణు, ఎండి. హలీం, సిహెచ్. లక్ష్మణ్, రమేష్, వేణు మరియు సిడిఆర్ వింగ్ సిబ్బందిని జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.