`సోషల్ మీడియాలో విపరీతంగా చకర్లు!
`తెలంగాణ కు కరంట్ తెచ్చాను

`తెలంగాణ కు కరంట్ ఇచ్చాను
`ట్రాన్సఫార్మార్లు నేనే ఇచ్చాను

`స్కూల్స్ నేనే కట్టించాను
`మెడికల్ కాలేజీలు కట్టించాను
`ఇంజనీరింగ్ కాలేజీలు కట్టించాను
`ఐటీ నేనే తెచ్చాను
`సైబారాబాద్ నిర్మాణం చేశాను
`ముస్లింలను కోటేశ్వరులను చేశాను
`హైదరాబాద్ బిర్యానీ ప్రమోట్ చేశాను
`రత్నాలా వ్యాపారం పెట్టించాను
`గుళ్ళు కట్టించాను
`యాదగిరి గుట్ట కట్టించాను
`భద్రాచలం నేనే కట్టించాను
`బాసర నేనే నిర్మాణం చేశాను
`కీసర నేనే కట్టించాను
`జోగులాంబ గుడి నేను కట్టించాను
`సమ్మక్క సారక్క గుడి కట్టించాను.
`తెలంగాణ నా వల్లనే వచ్చింది.
`నేను లెటర్ ఇవ్వడం వల్లనే తెలంగాణా సాకరమైనది.
`అవును.. అవును అని అంటున్న రాధాకృష్ణ
హైదరాబాద్, నేటిధాత్రి:
గుడి కట్టించింది మా నాన్న. బడి కట్టించింది మా నాన్న. దర్మసత్రం కట్టించింది మా నాన్న. దర్మాసుపత్రి కట్టించింది మా నాన్న. అని గతంలో జమిందాలు కుటుంబాలకు చెందిన వారసలు చెప్పుకునేవారు. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం జమిందారులది కాదు. కటిక పేద రైతు కుటుంబం. ఆయనకు వారసత్వంగా వచ్చింది రెండు ఎకరాలు. అలాంటి నాయకుడు మా తాతలు, ముత్తాతలు అవీ ఇవీ కట్టించారని చెప్పలేరు. అందుకే తెలంగాణలో నిర్మాణాలన్నీ నేనే కట్టానని చెప్పుకుంటున్నారు. ఆంద్రప్రదేశ్‌లో ఏది చెప్పుకున్నా జనం నమ్మరు. ఉత్తరాంద్రలోని విజయనగర రాజు వంశీయుడైన అశోకగజపతి రాజు లాంటివారు ఆ ప్రాంతాన్ని తామే అభివృద్ది చేశామని చెప్పుకుంటే చరిత్ర కూడా హర్షిస్తుంది. కాని చంద్రబాబు నాయుడు తెలంగాణను ప్రపంచ పటంలోనేనే పెట్టానంటాడు. ఆయన మాటలు వించే చరిత్ర కూడా సిగ్గుతో తలదించుకుంటుంది. తెలంగాణ గురించి చంద్రబాబు ఏది చెబితే అది ఏపి ప్రజలు నమ్మేస్తారని ఓ నమ్మకం. అందుకే ఆయన నోటి నుంచి వెలువడే ఆణిముత్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో రూపంలో వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే అబద్దాలను కూడా చాలా సాదా సీదాగా, ఎలాంటి జంకు బొంకు లేకండా చెప్పడం ఏపి సిఎం. చంద్రబాబు స్పెషాలిటి. ఆయన చెప్పే మాటలు విని జనం ఏమకునుకుంటున్నారు? అనేది ఆయనకు అవసరం లేదు. అందుకే గాలి దిశ ఎలా వుంటుంది? ఆ గాలిలో ఎన్ని రకాల విషపూరిత సూక్షజీవులు వున్నాయి. ఆ గాలి ఎంత దూరం వెళ్తోంది. ఏఏ పంటల మీద దాని ప్రభావం చూపుతోందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానని చెబుతుంటే జనం విస్తుపోతున్నారు. వింతగా వింటున్నారు. తాము వింటున్నది నిజమేనా? అని ఆశ్చర్యపోతున్నారు. గాలి దిశలు ఎలా కనుగొనటమో? ఆ గాలి ఎంత దూరం ప్రయాణం చేస్తుందని అంచనా వేయడమేమిటో? ఆ గాలిలో వుండే వైరస్లు ఏ పంటలకు నష్టం చేస్తున్నాయని కనుగొనడం ఏమిటో? అంతా మిద్య. అయినా ఓ బాపతు మీడియా మాత్రం పత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాలతో ముద్రిస్తుంది. టెలివిజన్ న్యూస్ చానల్స్ అహో అద్భుతమని పొగుడుతుంటాయి. వాటిపై డిబేట్లు పెట్టి మరీ చర్చిస్తుంటాయి. ఇక సోషల్‌మీడియా సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మధ్య సముద్రం మీద తుఫానులు, వాయి గుండాల మీద కూడా కొన్ని విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా ఎండ తీవ్రత ఎలా తగ్గించాలన్నదానిపై కూడా అధికారులు దృష్టిపెట్టాలని కూడా ఆదేశాలు జారీచేసినట్లు వార్తలు వచ్చాయి. సరే ఇవన్నీ ఏపి ప్రజలకు వినసొంపుగానేవుండొచ్చు.అది చెప్పే వారి ఇష్టం. వినేవారికి సంతోషం. కాని తెలంగాణపై ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. తెలంగాణకు కరంటునేనే తెచ్చాను అంటున్నారు. అందుకు ఆ ఇంటర్వూ చేస్తున్న ఏబిఎన్ రాధాకృష్ణ అవును…అవును అంటూ తలూపుతున్నారు. నిజమే అంటున్నారు. తెలంగాణకు కరంటు నిజాం కాలంలోనే వుంది. తెలంగాణ అనేది స్వాతంత్య్రానికి పూర్వం ఒక రాజ్యం. అంటే ప్రత్యేక దేశం. తెలంగాణకు ప్రత్యేకమైన కరెన్సీ వుండేది. తెలంగాణ రైల్వే ప్రత్యేకంగా వుండేది. తెలంగాణ టెలిఫోన్ శాఖ వుండేది. తెలంగాణలో ప్రత్యేక కరెన్సీ వుండేది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్‌కు ఆనుకొని విద్యుత్ కేంద్రం వుండేది. నగరానికి అంతటికి సరఫరా చేసేది. అలాంటి తెలంగాణకు తానే కరంటుతెచ్చాను. తెలంగాణ మొత్తానికి కరంటు ఇచ్చాను. రైతులకు ట్రాన్స్ ఫార్మర్లు నేనే ఇచ్చాను. అంటున్నారు. అంటే ట్రాన్స్ ఫార్మర్లు చంద్రబాబు ఇవ్వడమేమిటో? అర్ధం కాని ముచ్చట. తెలంగాణ రైతులు విద్యుత్ చార్జీలు తగ్గించమని కోరితే రూపాయి కూడా తగ్గించని నాయకుడు చంద్రబాబు నాయుడు. అసలు చంద్రబాబు నాయుడు సిఎం. అయ్యింది 1995లో అప్పటికే తెలంగాణ సర్వతోముఖాభివృద్దిలో వుంది. తెలంగాణ ప్రాంతం ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం. ఉద్యమాలకు పుట్టినిల్లు. నైజాం పాలనను పారద్రోలిన ప్రాంతం. ఇలాగే చెప్పుకుంటూ పోతే ఇంకొన్ని రోజులకు కాళేశ్వరం నేనే కట్టానని కూడా అంటారేమో? ఎందుకంటే తెలంగాణ నా వల్లనే వచ్చిందనే మాటలు మాట్లాడడానికి కూడా ఏమాత్రం చంద్రబాబు వెనుకాడడు. తెలంగాణకు విద్యా వ్యవస్థను తెచ్చిందేనేను అన్నంత దోరణిలో మాట్లాడుతున్నారు. అసలు తెలంగాణలో 1918లోనే ప్రపంచ విఖ్యాతి గాంచిన ఉస్మానియా యూనివర్సిటీ నిర్మాణం జరిగింది. అంబెద్కర్ లాంటి వారు కూడా ఉస్మానియా నుంచి లా పట్టా పొందారు. మాజీ ప్రధాని నర్సింహరావుతో సహా కొన్ని వేల మంది మేధావులను తయారు చేసింది ఉస్మానియా యూనివర్సిటీ. తానే ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చానంటాడు. ఐటికి నేనే ఆధ్యుడినంటారు. అసలు హైదారాబాద్‌కు ఐటి రావడానికి ప్రధాన కారణం మాజీ ముఖ్యమంత్రి నేదురు మల్లిజనార్ధనరెడ్డి. అప్పటికే కర్నాటకలో ముఖ్యమంత్రి ఎస్ఎం. కృష్ణ ఐటి ఇండస్ట్రీని తెచ్చారు. ఆ సమయంలోనే నేదురు మల్లి జనార్దన్‌రెడ్డి హైటెక్ సిటీ నిర్మాణానికి శంకుస్దాపన చేశారు. తెలంగాణకు వైద్య విద్యను తెచ్చానంటారు. అసలు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మెడికల్ కాలేజీలే కాని, చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ తేలేదు. తెలంగాణలో స్కూళ్లన్నీనేనే నిర్మించానంటాడు. ఇంకా విచిత్రమైన విషయమేమిటంటే యాదగిరి గుట్ట నేనే కట్టానని చెప్పుకున్నాడు. నవ్విపోదురుగాక నాకేంటి అన్నట్లు వుంది ఈ మాట. యాదగిరి గుట్టను కేసిఆర్ పునర్నిర్మానం చేశాడు. కాని చంద్రబాబు ఏకంగా తొలి గుడి నేనే కట్టానని చెప్పుకుంటున్నారు. ఈ మాటలు యాదర్శి మహార్షి వింటే ఏమౌతారో? మనదేశ స్వతంత్ర భారతావనిలో ఇప్పటి వరకు ప్రభుత్వ దనంతో ఏ పాలకుడు ఏ గుడిని నిర్మాణం చేయలేదు. అది తెలంగాణ ఉద్యమ కారుడు, తెలంగాన సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ వల్లనే సాధ్యమైంది. ఒక గుడి నిర్మాణం అంటే చంద్రబాబు చెప్పిన మాటలంత తేలిక కాదు. యాదగిరి గుట్టను పునర్నిర్మాణం చేసి చరిత్రలో నిలిచిన నాయకుడు కేసిఆర్. కాని ఏనాడు కేసిఆర్ ఇలా గొప్పలు చెప్పుకోరు. ఇక సమ్మక్క సారక్క జాతరకు నా వల్లనే పేరుచ్చిందన్నారు. అసలు ఎప్పటి సమ్మక్క సారక్క. ఎప్పటి చంద్రబాబు నాయుడు. 13వ శతాబ్ధం నుంచి కొన్ని వందల సంవత్సరాలుగా సమ్మక్క, సారక్కల జాతరలు జరుగుతున్నాయి. అసలు ఇలాంటి మాటలు చెబితే జనం ఏమనుకుంటారని కూడా అనుకోకుండా చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లింది. కీసర గుట్టపై రామలింగేశ్వర స్వామి దేవాలయం, విష్లుకుండిన రాజుల కాలంలో నిర్మాణంజరిగిన పెద్ద పుణ్యక్షేత్రం. అలాంటి కీసరను కూడా నేనే నిర్మించానని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా వుంది. ఇక దేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన ఎంతో మహిమాన్వితమైన జోగులాంబ క్షేత్రాన్ని తానే నిర్మించానని చెబుతుండడం, అందుకు ఏబిఎన్ రాధాకృష్ణ అవును, అవును అనడం దౌర్భాగ్యం. అసలు ఆ శక్తి పీఠం ఎప్పుడు ఏర్పడిరదనడానికి స్పష్టమైన చారిక్రత ఆధారాలు లేవు. కాని పురాణాల ప్రకారం కొన్ని వేల సంవత్సరాల క్రితం శక్తి పీఠం ఏర్పడిరది. దానిని కర్నాకట ప్రాంతాన్ని పాచించిన తూర్పు చాళుక్యులు, బాదామీ చాళుక్యులు గుడి నిర్మాణం చేసినట్లు శిలా శాసనాల తెలుస్తోంది. అది కూడ సుమారు 6శతాబ్ధ కాలంలో నిర్మాణం జరిగింది. అంటే అది ఎప్పుడు మొదలైందో కూడా తెలియదు. అలాంటి నిర్మాణాన్ని తాను కట్టించానని చంద్రబాబు చెప్పడం విడ్డూరం. ఇక బాసర అనేది దేశంలోనే వున్న ఏకైక పురాతమైన దేవాలయం. ఎందో మంది రుషులు సరస్వతి అమ్మవారి ఆశీస్సులకోసం గోదావరి తీరాన కొన్ని వందల సంవత్సరాలు తపస్సులు చేసి గుడి నిర్మాణం చేపట్టారు. ఇక భద్రాచలం దేవాలయం కూడా నేను నిర్మించిందే అంటే కంచర్ల గోపన్న ఆత్మ క్షోబిస్తుంది. పోలవరం నిర్మాణంతో భద్రాద్రి రాయమ్య మునిగిపోతాడని తెలిసినా ఆ దాని నిర్మాణం చేస్తున్నాడు. అలాంటి చంద్రబాబు తానే భద్రాద్రినిర్మాణం చేసినట్లు చెప్పుకోవడం మరీ విచిత్రం. ఇక తెలంగాణలో అత్యంత ఫేమస్ అయిన ఆహారం. బిర్యాని. అసలు బిర్యాని అనే పదం ఎక్కడిదో..ఎక్కడి నుంచి వచ్చిందో చరిత్ర తెలియని చంద్రబాబు దానిని ప్రమోట్ చేశానని అందుకే అంత ఫేమస్ అయ్యిందని చెబుతున్నారు. దేశంలోనే అత్యంత అరుదైన వంటకం తెలంగాణ బిర్యాని. ఆ బిర్యాని అనేది మొఘలల కాలంలో వారి హైదరాబాద్ పాలకులుగా నియమింపబడిన కుతుబ్షాషీలు పరిచయం చేసిన వంట అది. అది మన దేశానికి చెందినది కూడా కాదు. ఇరాన్ నుంచి వచ్చిన కుతుబ్‌షాహీలు కొంత కాలం మొగలుల సంస్దానంలో సైనిక నాయకులుగా పనిచేశారు. వారి పనితీరును మెచ్చుకొని దక్షిణాదిన గోల్కొండ రాజ్యానికి ఔరంజేబు వారిని పాలకులుగా పంపించారు. అప్పటి నుంచి తెలంగాణ, హైదరాబాద్ ప్రజలు బిర్యాని తయారుచేసుకోవడం, తినడం అలవాటు చేసుకున్నారు. గోల్కొండ నవాబుల ప్రధానమైన వ్యాపారం వజ్రాలు. ఈ సంగతి చాల మందికి తెలియదు. రాజులేమిటీ? వారికి వ్యాపారాలేమిటి? అనే ప్రశ్న కూడా ఉత్పన్నమౌతుంది. కాని నిజాం నవాబులు వజ్రాల వ్యాపారం చేసేవారు. కోహినూర్ డైమండ్ అందులో భాగమే. ఆ రోజుల్లోనే లండన్ నుంచి వ్యాపారులు వచ్చిన హైదరాబాద్ నుంచి వజ్రాలు కొనుగోలు చేసేవారు. తర్వాత కాలంలో కొత్త నగరం నిర్మాణమైన తర్వాత చార్మినార్ పరిసర ప్రాంతాలలో వాటి వ్యాపారం విరివిగా జరిగిందే. వజ్రాల వ్యాపారంతోపాటు అనేక రకాల వ్యాపారాల సముదాయంగా మారిపోయింది. వాటిని కూడా నేనే ప్రారంబించానని చంద్రబాబు చెప్పుకునే ఓ వీడియో గత రెండు రోజులుగా సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూస్తూ, వింటూ తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. అబద్దాలకు కూడా హద్దూ బద్దు లేకుండా చంద్రబాబు చెబుతుంటే ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.
