సివిల్ సప్లై గోదాములలో గోల్ మాల్…?
జవాబుదారితనం లేని నిర్వాకులు
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండలంలోని సివిల్ సప్లై గోదాములలో కొందరు ఉద్యోగలు అవకతవకలకు పాల్పడుతున్నారని కేసముద్రం సహకార బ్యాంకు విశ్రాంత ఉద్యోగి సీఈఓ వెంకటచలం ఆరోపించారు. గురువారం కేసముద్రంలో పత్రికా ప్రకటన విడుదల చేసిన అనంతరం వారు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో ఇనుగుర్తి ధాన్యం కొనుగోలు కేంద్ర మిగిలిన గన్ని బ్యాగుల విషయం సివిల్ సప్లై ఉద్యోగులు అవకతవకలకు పాడుపడుతున్నారని అన్నారు. గన్ని బ్యాగుల 83 కట్టల లో ఉన్న 4,150 ఖాళీగా అన్ని బ్యాగులను కేసముద్రంలోని సివిల్ సప్లై గోదాంలో సంబంధిత అధికారులకు అప్పగించడం జరిగిందని తెలిపారు. అట్టి 83 కట్టలకు గాను రూపాయలు 40 చొప్పున 3420 దిగుమతి చార్జీలు కూడా చెల్లించామని అన్నారు కేంద్రం ఇన్చార్జి అయిన సురేందర్ ను 83 కట్టల కాళీ బ్యాగులు దిగుమతి అయినట్లు రాసి ఇవ్వాలని రసీదు అధికారులను అడగగా రేపు ఇస్తాం మాకు ఇస్తాం అంటూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా తాను కూడా సివిల్ సప్లై గోదాముకు వెళ్లి అడగగా 42 కట్టలు దిగుమతి అయినట్లు రాసి ఇవ్వడం జరిగిందని, తక్కువ గన్ని బ్యాగుల కట్టలు రాసి ఇవ్వడమేంటి అని అడగగా 52 కట్టలు దిగుమతి మాత్రమే దిగుమతి అయ్యాయని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్లిపోయినట్లు తెలిపారు. ఇట్టి విషయంపై అనేకమార్లు అడిగినా కూడా పెడచెవిన పెడుతూ అధికారులు బాధ్యతారహిత్యంగా ఒక విశ్రాంత ఉద్యోగి పైనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆవేదన వ్యక్తం చేశారు.సివిల్ సప్లై గోదాంలో జరుగుతున్న అవకతకులపై విచారణ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పై అధికారులను ఈ సందర్భంగా వారు కోరారు.