Going from home to work and getting lost
ఇంటి నుంచి కూలీ కి వెళ్లి గల్లంతు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్:పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్గోల్ గ్రామానికి చెందిన కూలీ మొండి బీరయ్య (49) అదృశ్యమైనట్లు జహీరాబాద్ టౌన్ ఎస్సై వినయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.. మొండి బీరయ్య డిసెంబరు 15న మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని ఆయన భార్య నర్సమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పి పోయిన సమయంలో ఆయన తెలుపు గీతల అంగి, నలుపు ప్యాంటు ధరించి ఉండగా, ఎత్తు సుమారు 5.6 అడుగులు ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై జహీరాబాద్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
