
Devi Navaratri Festivities Begin Across Zaheerabad
జగన్మాత శరణు శరణు
◆:-;నవరాత్రి శోభతో ఆలయాలు
◆:- నేటి నుంచి దేవీ శరన్నవరాత్రులు
◆:- రోజుకో రూపంలో అమ్మవారి దర్శనం
◆:- ప్రత్యేక మంటపాల ఏర్పాటు
◆:- ప్రతి ఇంట్లో అమ్మవారికి పూజలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: జిల్లా వ్యాప్తంగా ఉన్న అమ్మవారి ఆలయాలు దేవీ శరన్నవరాత్రి ఉత్సవా లకు ముస్తాబయ్యాయి. సోమవారం, ఆశ్వయుజ పాడ్యమి నుంచి అక్టోబర్ 2న దశమి వరకు దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. 11 రోజులపాటు అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ సంవత్సరం అమ్మవారు ముఖ్యంగా కాత్యాయనీ రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర స్వామివారి దేవాలయంతో పాటు మాచ్పూర్, బర్దిపూర్, క్రిష్ణాపూర్, కుప్పానగర్, బిడెకన్నె, ఏడాకులపల్లి, ఎల్గోయి, పొట్టిపల్లి, గుంతమర్పల్లి, ఈదులపల్లి తదితర గ్రామాల్లోని అమ్మవారి దేవాలయాల్లోనూ ఉత్సవాలు కొనసాగనున్నాయి. కేతకి సంగమేశ్వర ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. వెల్గోయి, బర్దిపూర్, మాన్పూర్ గ్రామాల్లో ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేశారు. 11 రోజులపాటు అమ్మవారు. ప్రతిరోజు ఒక్కో రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వ సున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు
ప్రాంతాలైన జహీరాబాద్, నారాయణఖేడ్లలోని ప్రతి గ్రామాలలో ప్రతి ఇంట్లోనూ భక్తులు నియమ నిష్టల తో తుల్జాభవాని అమ్మవారిని ప్రతిష్టించి, 11, 9, లేదా 5 రోజులపాటు పూజలు నిర్వహించ సున్నారు. జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల నుంచి మహారాష్ట్ర తుల్జాపూర్ శ్రీ తుల్లా భవాని దేవాలయం వరకు భక్తులు పాదయాత్రగా వెళ్లి అమ్మవారిని దర్శించుకోనున్నారు. 11 రోజుల పాటు జరిగే అమ్మవారి ఉత్సవాలకు ఏర్పాట్లు చేసినట్లు కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ చంద్రశేఖర్, కార్యనిర్వహణ అధికారి శివరు ద్రప్ప తెలిపారు. ఉత్సవాలను విజయవంతం నేయాలని వారు భక్తులకు విజ్ఞప్తి చేశారు.
నియమనిష్టలతో పూజలు..
జహీరాబాద్ ప్రాంతంలోని ప్రతి ఇంట్లో తుల్జా భవా ని అమ్మవారి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఏర్పాటు వేసి, నియమనిష్టలతో పూజలు నిర్వహిస్తారు. పుట్ట మన్ను తెచ్చి నవధాన్యాలైన వడ్లు, గోధువులు, కందులు. పెసర్లు, నల్ల మినుములు, శనగలు, పెన రపప్పు, ఉలవలు, నల్ల నువ్వులు వేసి, పచ్చి కురుక లో బియ్యం, పాలను పోసి అమ్మవారిని ప్రతిష్ఠి సారు. 24 గంటలపాటు దీపం నిరంతరంగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తారు. దసరా అనంతరం మొల కెత్తిన వాటిని తమ వ్యవసాయ భూముల్లో ఉంచి, వంటలు సమృద్ధిగా పండాలని వేడుకుంటారు,