వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి పట్టణంలో బ్రాహ్మణవాడలో పాండురంగ స్వామి దేవాలయంలో గోదాదేవి అమ్మవారి కళ్యాణోత్సవం సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సతీమణి శ్రీమతి సింగిరెడ్డి వాసంతి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పలస రమేష్ గౌడ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీదర్ పాల్గొన్నారని ఆలయ కమిటీ ముఖ్య సలహాదారు 15వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ విలేకరులకు తెలిపారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా గోదాదేవి అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆయన తెలిపారు .ఆలయ కమిటీ అధ్యక్షులు పూరి పాండు ఉపాధ్యక్షులు పాపిశెట్టి శ్రీనివాసులు కొంపల బాలచద్రుడు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కృష్ణ మున్సిపల్ కౌన్సిలర్ కాగితాల లక్ష్మీనారాయణ టిఆర్ఎస్ నేతలు డానియల్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్న దానంఏర్పాటు చేశామని బండారు కృష్ణ తెలిపారు
పాండురంగ స్వామి దేవాలయం లో గోదాదేవి కల్యాణం
