ధర్మం వైపు వెళ్ళండి…!
– జహీరాబాద్ సివిల్ కోర్ట్ జడ్జ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: విద్యార్థులందరూ ధర్మం వైపు వెళ్లాలని, అది మనల్ని రక్షిస్తుందని జహీరాబాద్ సివిల్ కోర్ట్ సీనియర్ జడ్జ్ గంట కవితా దేవి దత్తగిరి మహారాజ్ వేద పాఠశాల విద్యార్థులకు సూచించారు. గురువారం సాయంత్రం బర్దిపూర్ శ్రీ దత్తగిరి ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆలయ రాజగోపురం వద్ద వైదిక పాఠశాల విద్యార్థులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. జ్యోతిర్లింగాలు, దత్తాత్రేయ స్వామి, పంచవృక్షాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈనెల 29న శనైశ్వర స్వామి జయంతి కరపత్రాన్ని విడుదల చేశారు. వారికి ఆశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహరాజ్, మహామండలేశ్వర్ సిద్ధేశ్వరానందగిరి మహరాజ్ తీర్థ ప్రసాదాలు అందజేసి సన్మానించారు.