– ప్రతి కార్యకర్తా సైనికుడిలా కష్టపడాలి,
– ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి
– ఆసుపత్రితో ఎంత సేవ చేస్తున్నానో ప్రజలకు తెలుసు
– ఈస్ట్ ఆనందబాగ్ లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మర్రి రాజశేఖర్ రెడ్డి , *వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన మర్రి రాజశేఖర్ రెడ్డి , ఎం బి సి చైర్మన్ నందికంటి శ్రీధర్ *
మల్కాజిగిరి, నేటిధాత్రి,అక్టోబర్ 30:
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మన పార్టీకి బలమని, గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోవాలని మల్కాజిగిరి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం ఈస్ట్ ఆనందబాగ్ లో కార్యకర్తలు, నాయకులు, పార్టీ శ్రేణులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరై మాట్లాడారు. బీఆర్‌ఎస్ చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. అరుంధతీ ఆసుపత్రి ద్వారా ఎంతోమంది పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని, దానిని కూడా తప్పుగా మాట్లాడుతున్నారని, మేము చేస్తున్న సేవల గురించి పాత్రికేయ మిత్రులకు కూడా తెలుసని స్పష్టం చేశారు. అదే విధంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై చర్చించాలని, ప్రజలకు వివరించాలని సూచించారు. మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో పలు, అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టారని, ప్రతి కుటుంబానికీ ఏదో విధంగా లబ్ధి చేకూరుతుందని, ఈ విషయాలనే పార్టీ కార్యకర్తలు ప్రజలకు వివరించాలని కోరారు. ఎవరికైనా మనస్పర్థలు ఉంటే వాటిని చర్చల ద్వారా తొలగించుకోవాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ను మరోసారి అధికారంలోకి తీసుకురావాలని, ఇందుకోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అందరం సమిష్టిగా పనిచేసి మల్కాజిగిరి గడ్డపైన గులాబీ జెండా ఎగురవేద్దామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి సర్కిల్ ఎన్నికల ఇంచార్జ్ జితేందర్ రెడ్డి మురుగేష్, జగదీష్ గౌడ్ , జేఏసీ వెంకన్న నర్సింగరావు, శ్రీకాంత్ , తదితరులు పాల్గొన్నారు