
New Buses Inaugurated at Singareni School
సింగరేణి పాఠశాలలో నూతన బస్సులను ప్రారంభించిన జిఎం
భూపాలపల్లి నేటిధాత్రి
శనివారం రోజున స్థానిక కృష్ణ కాలనీలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైనారు నూతనంగా పాఠశాలకు నియమింపబడిన 2 బస్సులను ప్రారంభించారు. జిఎం మాట్లాడుతూ ఈ స్కూలు బస్సులు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం, త్వరగా సేవలలోకి బస్సులలో తీసుకురావడం జరిగిందని, విద్యార్థులకు ఇది ఎంతో సౌకర్యవంతంగా, ఉపయోగకరంగా ఉంటుందని వారి విలువైన సమయమును కోల్పోకుండా ఈ బస్సుల ద్వారా త్వరగా పాఠశాలకు చేరుకోవచ్చునని, అలాగే విద్యార్థులు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా, సురక్షితంగా పాఠశాలకు ఈ బస్సుల ద్వారా చేరుకోవచ్చని విద్యార్థులకు తెలియజేశారు, అదేవిధంగా సింగరేణి పాఠశాల విద్యార్థులు పదవ తరగతిలో గత సంవత్సరం మంచి ర్యాంకులను కైవసం చేసుకున్నారని, నూటికి నూరు శాతం ఉత్తీర్ణులు అయ్యారని అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 10వ తరగతి విద్యార్థులు జిల్లా స్థాయి ర్యాంకులను తీసుకువచ్చి పాఠశాలకు సింగరేణి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆయన విద్యార్థులకు సూచించారు, ఈ కార్యక్రమంలో, ఏరియా పర్సనల్ మేనేజర్, (పాఠశాల కరస్పాండెంట్) కావూరి మారుతి, పాఠశాల ప్రిన్సిపల్, ఝాన్సీ రాణి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.