నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలు ఈనెల 25 నుండి 28 వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయని ఈ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు.బుధవారంమండల కేంద్రంలో సిపిఎం రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.సందర్భంగా ఆయన మాట్లాడుతూ,సిపిఎం ప్రజా సమస్యల కోసం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు రాష్ట్రంలో ప్రాజెక్టుల సమస్యలు భూమిలేని నిరుపేదల సమస్యలు కార్మిక హక్కులు కార్మిక చట్టాలు రక్షణకై ఉద్యమాలు కొనసాగిస్తుందని అన్నారు. నిరంతరం పేదలు కార్మికులు ఉద్యోగులు కష్టజీవులు హక్కుల కోసం పోరాడుతున్న పార్టీ ప్రజాస్వామ్యం లౌకిక విధానం సామాజిక న్యాయం కోసం అంకిత భావంతో ఉద్యమిస్తున్న పార్టీ సిపిఎం అని ఆయన అన్నారు.ఈ మహాసభల్లో రాష్ట్రంలోని ఆర్థిక సామాజిక అంశాలు కార్మిక కర్షక పేదలు మహిళలు ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరించే భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని ఆయన అన్నారు కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలు పారిశ్రామికరంగాన్ని వ్యవసాయరంగాన్ని దివాలా తీయించాయని,విద్య వైద్యం సామాన్యులకు అందని ద్రాక్షలా మారిందని ఆయన అన్నారు ఈ రాష్ట్ర మహాసభల్లో అనేక ప్రజా సమస్యలపై చర్చించి దిశా నిర్దేశం చేయడం జరుగుతుందని ఈ సభ జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు చిట్టి మల్ల లింగయ్య, సిపిఎం నాయకులుఈరటి వెంకటయ్య,కృష్ణయ్య,నాగేష్, హమాలి సంఘం నాయకులుతదితరులు పాల్గొన్నారు
సిపిఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి : *సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ
