
Villagers Protest for House Pattas in Paidigummal
మా ఇల్ల పట్టాలు ఇప్పించండి – పైడిగుమ్మల్ గ్రామస్థులు ఆవేదన
◆-ముపై ఏళ్ల నుండి పట్ట సర్టిఫికెట్ తన వద్దే పెట్టుకున్న మాజీ సర్పంచ్
◆-ఎవరైనా ఏదైనా చేసుకోండి అంటున్న వైనం…!
◆-తన సన్నీ హిత వర్గాలకు ఇళ్ల ఖాళీ స్థలాలు కేటాయించి…..స్థానిక సంస్థ ఎన్నీకలో ఓటు బ్యాంకు పెంచుకునే వైనం..
◆:- …సహించిదే లేదంటున్నా గ్రామస్థులు…
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పైడిగుమ్మల్ గ్రామం లో సంచలనం రేపుతున్న వ్యవహారం.ఆ గ్రామస్థులు మాట్లాడుతూ అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన ఇల్ల స్థలాలు పట్టా పేపర్ స్ మాజీ సర్పంచ్ వద్దే ఉంచుకొని తన ఇష్ట రాజ్యాంగ వ్యాహరిస్తున్నారు.గ్రామానికి సంభందించిన కాటిలో స్థలం సర్వే నెంబర్ 5,6,7 గల మొత్తం 2.11గుంటల ప్రభుత్వం భూమి అప్పటి ప్రభుత్వం (కాంగ్రెస్ )30 సంవత్సరాల క్రితం ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించింది.అయితే అప్పుడున్న సర్పంచ్ మా గ్రామ సర్పంచ్ చే కదా అని నమ్మీ తమ సర్టిఫికెట్ స్ ఖాళీ స్థలాలు మ్యాప్ అప్పగించారు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మంజురు అవ్వడం తో తమ సర్టిఫికెట్ ఇల్ల స్థలాలు కేటాయించాలని అప్పటి గ్రామ సర్పంచ్ బి.మొల్లయ్య అడుగగా వారు వారి అనుచరులకు ఆ స్థలాలను కేటాయించి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓటు బ్యాంకు పెంచుకొనే ఆలోచన తో నిజమైన లబ్బిదారుల కు బెదిరింపుల కు పాల్పడుతున్నాడు గడిచిన సంవత్సరం కిందట ఇంటి స్థలం కలిగిన లబ్ధిదారులు వద్ద రూపాయలు 1000.చొప్పున ఒక్కరి వద్ద వసూలు చేసి, మీ స్థలాలను మీకు పంచుతాను అని వారికి తో చెప్పీ డబ్బులు వసూలు చేసాడు ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్లు మంజురు అవ్వడం తో ఇల్ల స్థలం కలిగిన మాజీ సర్పంచ్ ను అడుగగా నేను పంచను అని అంటున్నాడు.దీనిని దృష్టిలో పెట్టుకొని వెంటనే గ్రామ పెద్దలు యువకులు సంబంధిత మండల అధికారికి వినతి పత్రం అందజేసి ఎవరూ స్థలాలను వారికి కేటాయించాలని కోరరు తహసీల్దార్ స్పందించి
వెంటనే ఆ స్థలాల పై ఎన్కెవ్వరి చేయించి నిజమైన అర్హులకు కేటాయిస్తాం అన్నారు.
ఈ కార్యక్రమంలో పైడిగుమ్మల్ మాజీ ఎంపీటీసీ జ్ఞనరత్నం అంబెడ్కర్ యువజన సంఘం అధ్యక్షులు చీమల.ప్రశాంత్ తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం గ్రామ కార్యదర్శి కాడి కరుణాకర్ గ్రామ యువకులు ప్రేమ సంపత్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మోహన్ చీమల ప్రేమ్ కుమార్ రమేష్ అనిల్ నాగేష్ దానమ్మ అంతమ్మ రుతమ్మ తదితరులు పాల్గొన్నారు.