
Minister Reviews Municipal Development in Tirupati
*ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనివ్వండి..
*టిడిఆర్ బాండ్లు అర్హులైన వారికి ఇస్తున్నాం..
*గ్రామాలనుంచి వచ్చే ఆదాయం గ్రామాభివృద్ధికే ఖర్చు చేయాలి..
*శెట్టిపల్లి భూముల సమస్య త్వరలో పరిస్కారం…
*ఆదాయం పెంపుదలకు కొత్త లే అవుట్స్ ఏర్పాటు..
*పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ..
తిరుపతి(నేటిధాత్రి)ఆగస్టు 25 :
ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనకు అధికారులు ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేస్తున్నారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు.
సోమవారం ఉదయం తుడా కార్యాలయంలో నగరపాలక సంస్థ ,తుడా అధికారులతో అభివృద్ధి పనులు, ప్రజలకు కల్పించాల్సిన వసతులపై మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారుతుడా టవర్స్ , ప్లాట్స్ , దుకాణాల పై వచ్చే అదాయ, వ్యయాలపై తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, వి.సి., జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, నగరపాలక సంస్థ లో పారిశుద్ధ్యం, సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, కార్మికులకు కల్పించాల్సిన వసతులపై కమిషనర్ ఎన్.మౌర్య వివరించారు. టౌన్ షిప్ లను అభివృద్ధి చేసి తుడా ఆదాయాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. తుడా ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అన్నారు. పక్కా ప్రణాళికతో ముందుకెళ్లి లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించే నివేదికలను ఇవ్వకుండా వాస్తవాలను వివరించి, ప్రజల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. నెల్లూరు తరహాలో తిరుపతిలో కూడా రోడ్ల శుభ్రతకు స్వీపింగ్ మిషన్ లను వినియోగించాలని అన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునికృష్ణ,డిప్యూటీ కమిషనర్ అమరయ్య, తుడా సెక్రటరీ డాక్టర్ శ్రీకాంత్, సూపరింటెండెంట్ ఇంజినీర్లు కృష్ణా రెడ్డి, శ్యాంసుందర్, ఈ.ఈ.లు రవీంద్ర,తులసి కుమార్, గోమతి, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.