*సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్న చల్మెడను భారీ మెజారిటీతో గెలిపించండి
*బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు సతీమణి సునీల
*వేములవాడ పట్టణంలోని 12వ వార్డులో ఇంటింటి ప్రచారం
వేములవాడ, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గడపగడపకు గులాబీ జెండా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వేములవాడ పట్టణంలోని 12వ వార్డులో బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు సతీమణి సునీల ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి-రాజు, స్థానిక వార్డ్ కౌన్సిలర్ రామతీర్థపు కృష్ణవేణి-హరీష్ లతో కలిసి వార్డులోని ఇంటింటికి వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి, బి.ఆర్.ఎస్ పార్టీ మేనిఫెస్టోను వివరిస్తూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి మళ్ళీ ఒకసారి బి.ఆర్.ఎస్ పార్టీకే అధికారం ఇవ్వాలని, కారు గుర్తుకే ఓటు వేయాలని సూచించారు. వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఆశయంతో, సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్న చల్మెడ లక్ష్మీ నరసింహా రావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గూడూరి లక్ష్మీ-మధు, జడల లక్ష్మీ-శ్రీనివాస్, కందుల శ్రీలత-క్రాంతి, జలగం హనుమంతరావు, గడప లక్ష్మణ్, బాణాల గోపి తదితరులు పాల్గొన్నారు.