
ఉప్పల్ నేటిధాత్రి మార్చ్ 28
ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్స్ , జిహెచ్ఎంసి గ్రౌండ్స్ లో మార్నింగ్ వాకర్స్ తో కలిసి నడిచిన ఈటల రాజేందర్.
వాటితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఒక్క సారి ఒడిపోగానే
బిఆర్ఎస్ పరిస్థితి పూర్తిగా దిగజారింది.
ఎంపీగా కనిపిస్తే కేంద్రం దగ్గర నిధులు తీసుకొస్తాను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం కొట్లాడుతాను.
నిండు మనసుతో ఆశీర్వదించండి.
ఈటల రాజేందర్,
మల్కాజ్గిరి పార్లమెంటు బిజెపి అభ్యర్థి.
ఈటల రాజేందర్ మాట్లాడుతూ..
మీరందరూ విజ్ఞులు రాజకీయాల మీద సంపూర్ణ అవగాహన ఉన్నవారు. ఒక్కసారి మిమ్మల్ని కలిసి ఓటు వేయమని అడుగుదామని వచ్చాను.
తెలంగాణ రాష్ట్రానికి మేమే ఛాంపియన్స్ అని చెప్పుకున్న టిఆర్ఎస్ ఒకసారి ఓడిపోగానే వారి పరిస్థితి ఎలా ఉందో చూడండి.
పరస్పర అవసరాల సంబంధాలు తప్ప ప్రేమపూర్వక సంబంధాలు లేవని కేసీఆర్ కి అనేకసార్లు చెప్పాను.
ప్రజలకు కనెక్టివిటీ పోయింది ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన పార్టీ టిఆర్ఎస్ పేరు మార్చి
బిఆర్ఎస్ చేశాక తెలంగాణ ప్రజలకు మీకు సంబంధం తెగిపోయింది. వారికి ఓటు వేస్తే ఇక్కడ అధికారం లేదు అక్కడ వచ్చేది లేదు అందుకే వారికి ఓటు వేయడం ఇర్రలవెంట్.
కెసిఆర్ ఓడిపోవాలని లక్ష్యంగా ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేశారు.
ఆరు గ్యారెంటీల పేరిట 66 హామీలు 400 సమస్యలను ప్రస్తావించారు. రాసిన వారికి చెప్పిన.. వారికి గుర్తు లేకపోవచ్చు కానీ వాటిని గుర్తు చేసి అడుగుతాము.
వచ్చేది లేదు, ఇచ్చేది లేదు అనే భావనతో కాంగ్రెస్ ఎన్ని హామీలు ఇచ్చినట్లు ఉంది.? గవర్నమెంట్ కు వస్తాము అనుకుంటే ఇలాంటి హామీలు ఇచ్చేవారు కాదు.
మొదటి శాసనసభ సమావేశాల్లోనే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ మాకు చిప్పచేతకు ఇచ్చారు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు.
కానీ ఇప్పుడు పార్లమెంట్లో 17 సీట్లు గెలిపించి ఇవ్వండి కేంద్రం దగ్గర కొట్లాడుతాం డబ్బులు తీసుకొస్తాము సమస్యలు పరిష్కరిస్తామని అంటున్నారు.
మంత్రిగా పనిచేయకుండా నేరుగా ముఖ్యమంత్రి అయ్యారు.. కానీ నేను మంత్రిగా పనిచేసిన కేంద్రం నుంచి డబ్బులు ఎలా వస్తాయో నాకు తెలుసు. వేరు వెళ్లి అడగగానే ఇవ్వటానికి ఉండదు.
ఆరునెలల తర్వాత ఆరు గ్యారెంటీలపై ఒత్తిడి పెంచుతాము. అందులో నేను ముందు ఉంటాను.
ఉగ్రవాదుల పట్ల సింహ స్వప్నంగా మారి వారి భరతం పడుతున్న నాయకుడు నరేంద్ర మోడీ.
బిజెపి పదేళ్ల పాలనలో ఎక్కడ బాంబు పేలుళ్లు లేవు తెగిపడ్డ శరీరాలు లేవు.
సెల్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు ఒకప్పుడు మెడిన్ చైనా, జపాన్ కానీ ఇప్పుడు అంతా మేడిన్ ఇండియా చేసిన వారు ప్రధాని నరేంద్ర మోడీ .
రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు యుద్ధం ఆపడానికి నరేంద్ర మోడీ రావాలని కోరుతున్నారంటేనే మన దేశ విలువ ఏ స్థాయికి పెరిగిందో అర్థం చేసుకోండి.
భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను సమ్మునోత్తంగా నిలబెట్టిగలిగే సత్తా ఒక భారతీయ జనతా పార్టీకి.. ప్రధాని నరేంద్ర మోడీకి మాత్రమే ఉంది.
మోదీ కి సరితూగే నాయకులు ఎవరూ లేరని తేలిపోయింది.
ఇక్కడ లేచినవాడు లేవని వాడు మోడీ గారి గురించి విమర్శిస్తున్నారు. చరిత్ర అందరికీ సమాధానం చెబుతుంది. దానికి ఓపిక కావాలి.
మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థిగా మోడీ,అమిత్ షా, నడ్డా గారి ఆశీర్వాదంతో వచ్చాను. 370 సీట్లు గెలవాలని బిజెపి సంకల్పంతో ఉంది.. 400 సీట్లకు పైగా గెలవాలని ఎన్డీఏ కూటమి సంకల్పంతో ఉంది అందులో మల్కాజ్గిరి ఒకటి ఉండాలని కోరటానికి మీ అందరి దగ్గరికి వచ్చాను.
మీ కాలనీలలో ఆఫీసులలో ఎవరికి వారు నాకు ఓటేయమని చెప్పి నిండు మనసుతో ఆశీర్వదించండి.
కొట్లాడే సమయంలో ఎలా ఉన్నాను అధికారం వచ్చిన తర్వాత మంత్రిగా ఎలా ఉన్నానో మీకు తెలుసు.
కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏమేమి తీసుకురావాలో ఎలా తీసుకురావాలో అవగాహన ఉన్నవాన్ని.
ఇక్కడ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న వారి భరతం పట్టే బాధ్యత కూడా నా మీద ఉంది అని ఈటల రాజేందర్ అన్నారు.