*ఈ- వేస్ట్ ను ఇవ్వండి – నగర అభివృద్ధికి సహకరించండి…
కమిషనర్ ఎన్.మౌర్య..
తిరుపతి(నేటి ధాత్రి) ఏప్రిల్ 19:
ప్రమాదకరమైన ఎలక్ట్రానిక్ వేస్ట్ తమకు అందజేసి నగర శుభ్రతకు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర లో భాగంగా శనివారం ఈ-వేస్ట్ సేకరణ, నిర్వహణపై నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మునిసిపల్ కార్యాలయం నుండి శ్రీదేవి కాంప్లెక్స్ వరకు సాగిన ఈ ర్యాలీ ని కమిషనర్ ఎన్.మౌర్య, శాప్ చైర్మన్ రవి నాయుడు, యాదవ కార్పొరేషన్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, ఏపీఎంఐడిసి డైరెక్టర్ విజయకుమార్, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్.సి.మునికృష్ణకార్పొరేటర్ నారాయణ, అధికారులు పాల్గొని ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు. An e-waste collection program was organized at Sridevi Complex. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్. మౌర్య మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జనవరి నెలలో పరిశుభ్రత పచ్చదనం, ఫిబ్రవరి నెలలో వేర్వేరుగా చెత్త సేకరణ,మార్చిలో ప్లాస్టిక్ నియంత్రణ థీమ్ తో ప్రజల్లో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు.ఏప్రిల్ నెలలో ఈ-వేస్ట్ నియంత్రణ థీమ్ తో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించామని అన్నారు.

ఎలక్ట్రిక్ దుకాణాల వద్ద వేస్ట్ సేకరించామని అన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆర్ఆర్ఆర్ సెంటర్ ను న్యూ బాలాజి కాలనీలోని అన్నా క్యాంటీన్ సమీపంలో ఏర్పాటు చేశామని ఈ-వేస్ట్ ను అక్కడ ఇవ్వ వచ్చునని అన్నారు. అలాగే అన్ని సచివాలయాల వద్ద కూడా ఇవ్వవచ్చునని తెలిపారు. ఇలా సేకరించిన వేస్ట్ ను సురక్షితంగా రీ సైకిల్ చేస్తామని అన్నారు. ప్రజలు ఈ-వేస్ట్ ను మీ ఇంటి వద్దకు వచ్చే మా సిబ్బందికి కూడా అందించవచ్చునని తెలిపారు. శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. జన్మభూమి, పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు.ఈ వేస్ట్ వలన కాలుష్యం పెరుగుతోందని దీన్ని నియంత్రించేందుకు ప్రత్యేక కార్యక్రమం రూపొంచించారని అన్నారు. ఇందులో అందరూ భాగస్వాములై ఎలక్ట్రానిక్ వ్యర్థాల నియంత్రణకు సహకరించాలని అన్నారు. స్వచ్ఛ తిరుపతి సాధనకు అందరూ సహకరించాలని అన్నారు. యాదవ కార్పొరేషన్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, ఏపీఎంఐడిసి డైరెక్టర్ విజయకుమార్, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్.సి.మునికృష్ణ మాట్లాడుతూ నగరం సుందరంగా, పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి బాధ్యత అన్నారు. చెత్తను రోడ్లపై వేయకుండా, తడి, పొడి చెత్త గా వేరు చేసి నగరపాలక సంస్థ సిబ్బందికి అందించి నగర శుభ్రత కు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈ-వేస్ట్ అందించిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, మేనేజర్ హాసీమ్, సర్వేయర్ కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు…