దివ్యాంగులకు చేయూత నివ్వండి… జిల్లా విద్యాధికారి

ఈరోజు అనగా తేది: 19-03 -2024 , కేంద్ర ప్రభుత్వ ,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

కొత్తగూడెం టౌన్.జాతీయ మెధో వైకల్య దివ్యాంగుల సాధికారిత సంస్థ, సికింద్రాబాద్ మరియు జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లోని సమావేశ మందిరం లో అంగన్వాడి టీచర్స్ , ఆశ వర్కర్స్ , సమ్మిలిత విద్యా ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన ఒకరోజు శిక్షణా కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ, గ్రామ స్థాయి లో ప్రతీ ఆవాస ప్రాంతంలో ఉన్న దివ్యాంగ పిల్లలను గుర్తించి, వారికి అవసరమైన సదుపాయాలను కల్పించడం లో ప్రధాన భూమిక పోషించేది మీరే కాబట్టి, అంకిత భావం తో పనిచేసి, దివ్యాంగులకు చేయూత ను అందించాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమం లో పాల్గొన్న సమ్మిళిత విద్యా కోఆర్డినేటర్ యస్. కె. సైదులు మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో సాధారణ ప్రజానీకాన్ని సైతం చైతన్య పరచి, దివ్యాంగ పిల్లలకు ప్రభుత్వం ద్వారా వచ్చే ఉపకారవేతనాలు, ట్రాన్స్పోర్ట్ అలవెన్సు లు, దివ్యాంగ పరికరాలు, ఫిజియో థెరపి, స్పీచ్ థెరపి సేవలువంటి మొదలైన అన్ని విషయాల పట్ల అవగాహన కల్పించాలని, తద్వారా దివ్యాంగులు కూడా సాధారణ పిల్లలతో సమానంగా ప్రాతినిద్యం పొందే విధంగా, విద్యా అవకాశాలు పొందే విధంగా అందరూ కృషి చేయాలని అన్నారు.

జాతీయ మేధో వైకల్య సాధికారత సంస్థ రిసోర్స్ పర్సన్ లకన్ బాబు ఈ సందర్బంగా మాట్లాడుతూ,
” 0-6 సంవత్సరాల దివ్యాంగుల ఎర్లీ ఇంటర్వేన్షన్ అండ్ రిహాబిలిటేశన్ సర్వీసెస్” దివ్యాంగుల గుర్తింపు, రకాలు, అసెస్మెంట్, నివారణ, గర్భస్థ దశ లో తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు , దివ్యాంగులకు ఉన్న చట్టాలు, స్కీములు , ఇతర థెరపిక్ అవసరాలు, ఉచిత ఉపకరణాలు, దివ్యాంగుల గుర్తింపు కార్డ్ మొదలగు విషయాల మీద మీద ఒకరోజు అవగాహన కార్యక్రమం లో చర్చించారు. ఇట్టి కార్యకమంలో జిల్లా విద్యా శాఖ అధికారి ఎం. వెంకటేశ్వర చారి,
మెడికల్ అండ్ హెల్త్ విభాగం ప్రోగ్రాం ఆఫీసర్ సుకృత, జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారులు యస్. కె. సైదులు, ఏ. నాగరాజ శేఖర్ , సమ్మిళిత విద్య రిసోర్స్ పర్సన్ లు, అంగన్వాడి టీచర్స్, ఆశా వర్కర్స్,పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!